ఉప్పెన టీజర్.. విలన్ ను దాచేశారు

uppena-teaser

సంక్రాంతి కానుకగా కొద్దిసేపటి కిందట ఉప్పెన టీజర్ రిలీజ్ చేశారు. వైష్ణవ్ తేజ్, కృతిషెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా టీజర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. పెద్దింటి అమ్మాయి, పేదింటి కుర్రాడి మధ్య జరిగే ప్రేమకథల్లో ఆరాధన ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే మూగ ప్రేమ ఎక్కువ. కానీ దానికి భిన్నంగా తెరకెక్కింది ఉప్పెన.

హీరోహీరోయిన్లు గాఢంగా ప్రేమించుకుంటున్న సన్నివేశాల్ని టీజర్ లోనే చూపించారు. అంతరాలు వేరైన ఇద్దరు ప్రేమికుల మధ్య చిచ్చుపెట్టిన అంశం ఏంటనే విషయాన్ని మాత్రం టీజర్ లో చూపించలేదు. ఇంకా చెప్పాలంటే విలన్ పరిచయ కార్యక్రమం జరగలేదు.

ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ గా నటించాడు. అతడికి సంబంధించిన సన్నివేశాల్ని ఇందులో చూపించలేదు. ఓ ప్రత్యేకమైన టీజర్ ద్వారా అతడ్ని పరిచయం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.