మొదటి రోజు మెరిసిన మాస్టర్

master movie

విజయ్ హీరోగా నటించిన మాస్టర్ సినిమాకు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనైతే ఈ
సినిమాను దాదాపు ఫ్లాప్ గా చెప్పుకోవచ్చు. రీసెంట్ గా వరుసగా హిట్స్ ఇచ్చిన ఈ హీరో, ఈసారి మాత్రం
మెప్పించలేకపోయాడు. ఇదిలా ఉండగా, వసూళ్లలో మాత్రం మాస్టర్ మెరిశాడు.

తొలి రోజు ఈ సినిమాకు ఏకంగా 5 కోట్ల 74 రూపాయల షేర్ వచ్చింది. విజయ్ సినిమాకు ఈ రేంజ్ లో
వసూళ్లు అంటే అది చెప్పుకోదగ్గ విశేషమే. ఎందుకంటే ఇదొక డబ్బింగ్ మూవీ కాబట్టి. అయితే ఈ రేంజ్
వసూళ్లు రావడం వెనక దిల్ రాజు లాబీయింగ్ బాగా పనిచేసినట్టు చెబుతారు. క్రాక్ ను తప్పించి, చాలా
థియేటర్లను మాస్టర్ కు ఇవ్వడం కోసం దిల్ రాజు మాస్టర్ ప్లాన్ వేశాడని సమాచారం.

ఈ సంగతి పక్కనపెడితే.. ఏపీ, నైజాంలో ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.
నైజాం – రూ. 1.49 కోట్లు
సీడెడ్ – రూ. 1.10 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.83 కోట్లు
ఈస్ట్ – రూ. 0.48 కోట్లు
వెస్ట్ – రూ. 0.56 కోట్లు
గుంటూరు – రూ. 0.67 కోట్లు
నెల్లూరు – రూ. 0.25 కోట్లు
కృష్ణా – రూ. 0.36 కోట్లు