మెగా హీరోలు @ అల్యూమినియం ఫ్యాక్టరీ

మెగా హీరోలంతా ఒకే చోటుకు చేరారు. మరో రెండు రోజుల్లో అంతా కలిసి ఒకే చోటు షూటింగ్
చేయబోతున్నారు. ఈ అరుదైన ఫీట్ కు అల్యూమినియం ఫ్యాక్టరీ వేదిక కాబోతోంది.

మరో 3 రోజుల్లో క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు పవన్ కల్యాణ్.
ఈ మూవీ కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ భారీ సెట్ వేశారు. అక్కడే షూటింగ్ జరుగుతుంది. ఇక అదే
లొకేషన్ కు కాస్త దూరంగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ మళ్లీ ప్రారంభం కాబోతోంది. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్
పాల్గొంటాడు. కరోనా నుంచి అతడు పూర్తిగా కోలుకున్న సంగతి తెలిసిందే.

ఇక అదే లొకేషన్ లో మరో వారం రోజుల్లో ఆచార్య సినిమా కొత్త షెడ్యూల్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ
షెడ్యూల్ లో చిరంజీవి-రామ్ చరణ్ మధ్య సన్నివేశాలు తీయడానికి ప్రిపేర్ అవుతున్నాడు దర్శకుడు
కొరటాల శివ.

ఇలా మెగా హీరోలంతా ఒకే లొకేషన్ లో ల్యాండ్ అవ్వబోతున్నారు. నిజానికి చరణ్ కోసం ఈ
ఏర్పాటుచేశారు. ఆర్ఆర్ఆర్, ఆచార్యకు ఒకేసారి అందుబాటులో ఉండడం కోసం ఇలా సెట్ చేశారు.
అనుకోకుండా పవన్ కల్యాణ్ మూవీ కూడా ఆ టైమ్ కు షెడ్యూల్ అయింది.