Telugu Global
Others

దేశంలోనే అతిపెద్ద గ్రావిటీ టన్నెల్ పూర్తి చేసిన మేఘా సంస్థ..

ప్రకాశం, కడప జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ మొదటి సొరంగం పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఈ సొరంగ నిర్మాణాన్ని పూర్తి చేసింది. దేశంలోనే అతిపెద్ద గ్రావిటీ టన్నెల్ ఇది. సొరంగం మొత్తం పొడవు 18కిలోమీటర్లు. ఇందులో 3.6కిలోమీటర్ల మేర పనుల్ని రికార్డ్ టైమ్ లో పూర్తి చేసి మేఘా ఇంజినీరింగ్ సంస్థ తన సత్తా చాటింది. ఈ సొరంగం తవ్వేందుకు అతిపెద్ద టన్నెల్ బోరింగ్ […]

దేశంలోనే అతిపెద్ద గ్రావిటీ టన్నెల్ పూర్తి చేసిన మేఘా సంస్థ..
X

ప్రకాశం, కడప జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ మొదటి సొరంగం పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఈ సొరంగ నిర్మాణాన్ని పూర్తి చేసింది. దేశంలోనే అతిపెద్ద గ్రావిటీ టన్నెల్ ఇది. సొరంగం మొత్తం పొడవు 18కిలోమీటర్లు. ఇందులో 3.6కిలోమీటర్ల మేర పనుల్ని రికార్డ్ టైమ్ లో పూర్తి చేసి మేఘా ఇంజినీరింగ్ సంస్థ తన సత్తా చాటింది. ఈ సొరంగం తవ్వేందుకు అతిపెద్ద టన్నెల్ బోరింగ్ మిషన్ ను వినియోగించారు.

శ్రీశైలం జలాశయం ఎగువ భాగాన కృష్ణానదిలో కొల్లంవాగు కలిసే దగ్గరనుంచి కాల్వలు మొదలవుతాయి. అక్కడినుంచి శ్రీశైలం అభయారణ్యం గుండా రెండు సమాంతర సొరంగ మార్గాల ద్వారా నీటిని పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అభయారణ్య రక్షణలో భాగంగా బోరింగ్ మిషన్ల ద్వారా సొరంగం తవ్వకాలు చేపట్టారు. అత్యంత అరుదుగా ఉపయోగించే టీబీఎం మిషన్ ద్వారా సొరంగం తవ్వారు. హెరెన్ నెక్ట్ అనే సంస్థకు చెందిన ఈ టీబీఎం మిషన్ ను ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా వెలిగొండ ప్రాజెక్ట్ లోనే వినియోగించారు.

ఇక ప్రాజెక్ట్ కోసం ఆసియాలో పొడవైన కన్వేయర్ బెల్ట్ వినియోగించారు. 18 కిలోమీటర్ల పొడవైన టన్నెల్ లోకి కన్వేయర్ బెల్ట్ వెళ్లేందుకే దాదాపు రెండుగంటల సమయం పడుతుంది. టన్నెల్ లోపల ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. దాదాపు 50 నుంచి 60 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల్లో మేఘా సిబ్బంది పనిచేయాల్సి వచ్చింది. కరోనా కష్టకాలం, వర్షాలను సైతం తట్టుకొని రోజుకి 10మీటర్ల చొప్పున టన్నెల్ ని తవ్వారు. అనుకున్న టైమ్ కి పని పూర్తి చేశారు.

ఈ సొరంగం మార్గం ద్వారా 3001 క్యూసెక్కుల నీటిని అంటే 85 క్యూమెక్స్ నీటిని జలాశయాలకు తరలిస్తారు. దేశంలోనే అతి పెద్ద గురుత్వాకర్షణ సొరంగాలలో ఇది కూడా ఒకటి కావడం విశేషం. ఈ ప్రాజెక్ట్ ద్వారా 1.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తారు, 4లక్షల మంది ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తారు. ప్రస్తుతం మొదటి సొరంగ మార్గం తవ్వకం విజయవంతంగా పూర్తి కాగా.. రెండో సొరంగ మార్గం పనులు కూడా ఊపందుకున్నాయి.

First Published:  14 Jan 2021 3:00 AM GMT
Next Story