హిందీ సినిమాలు చేయనంటున్న హీరో

hero-ram-stills

రామ్ చరణ్ ఆల్రెడీ హిందీలో ట్రై చేశాడు. ఇప్పుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కూడా బాలీవుడ్ బాట
పట్టాడు. వీళ్లిద్దరి మధ్యలో చాలామంది టాలీవుడ్ హీరోలు హిందీలో ట్రై చేశారు. కానీ ఒక హీరో మాత్రం
తను అస్సలు బాలీవుడ్ వైపు చూడనంటున్నాడు. అతడే రామ్.

రెడ్ సినిమాతో థియేటర్లలోకి వచ్చిన ఈ హీరో, తనకు బాలీవుడ్ పై ఎలాంటి ఆలోచనలు లేవని
స్పష్టంచేశాడు. అక్కడితో ఆగకుండా.. ఇదేదో మాటవరసకు చెప్పడం లేదని.. భవిష్యత్తులో కూడా
బాలీవుడ్ వైపు కన్నెత్తి చూసే ప్రసక్తి లేదని కుండబద్దలుకొట్టాడు.

ఇప్పటికీ, ఎప్పటికీ తను తెలుగు సినిమాలు మాత్రమే చేస్తానని అంటున్నాడు రామ్. అయితే మంచి సబ్జెక్ట్
దొరికితే తెలుగు-తమిళ భాషల్లో బై-లింగ్వల్ మూవీ చేసే ఆలోచన మాత్రం ఉందని.. బాలీవుడ్ కు వెళ్లే
ఆలోచన మాత్రం అస్సలు లేదని అంటున్నాడు రామ్.