సంక్రాంతి విన్నర్ ఎవరో తేలిపోయింది!

ఈ సంక్రాంతి విన్నర్ ఎవరో తేలిపోయింది. అందరికంటే ముందొచ్చిన రవితేజ, అందర్లో టాప్ హీరోగా
నిలిచాడు. అతడు నటించిన క్రాక్ మూవీ ఈ సంక్రాంతికి సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ప్రస్తుతం టాక్
పరంగా, వసూళ్ల పరంగా ఈ సినిమాదే అగ్రస్థానం.

క్రాక్ తర్వాత మాస్టర్ మూవీ రిలీజైంది. ఈ డబ్బింగ్ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ రోజు అల్లుడు
అదుర్స్, రెడ్ సినిమాలు రిలీజయ్యాయి. రెడ్ సినిమా ఓ సెక్షన్ ఆడియన్స్ ను మాత్రం ఆకట్టుకుంటుంది.
అటు అల్లుడు అదుర్స్ లో కామెడీ క్లిక్ అవ్వలేదు. ఫలితంగా ఈ రెండు సినిమాలకు ఎబోవ్ యావరేజ్
టాక్ మాత్రమే దక్కింది.

దీంతో సంక్రాంతి విన్నర్ గా రవితేజ నిలిచాడు. సంక్రాంతి మూవీగా క్రాక్ సినిమా నిలిచింది. ఈ మూవీతో
సంక్రాంతి హీరోగా నిలవడమే కాకుండా.. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న హిట్ ను కూడా అందుకున్నాడు
మాస్ రాజా.

సంక్రాంతి సినిమాల ఫలితాలు తేలిపోయాయి. ఇక అందరి దృష్టి సమ్మర్ పై పడింది. ఆచార్య, రాధేశ్యామ్, వకీల్ సాబ్ లాంటి పెద్ద సినిమాలు ఈ సమ్మర్ కు రాబోతున్నాయి. వీటిలో ఏది క్లిక్ అవుతుందో చూడాలి.