అల్లుడు అదుర్స్ మొదటి రోజు వసూళ్లు

Alludu Adhurs Day-1 Collection1

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, నభా నటేష్-అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా అల్లుడు
అదుర్స్. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమాకు నెగెటివ్ టాక్
వచ్చింది. సినిమా బాగాలేదంటున్నారు చాలామంది. అయితే మొదటి రోజు కావడంతో ఈ టాక్ తో
సంబంధం లేకుండా డీసెంట్ కలెక్షన్లు వచ్చాయి.

అల్లుడు అదుర్స్ సినిమాకు మొదటి రోజు 2 కోట్ల 77 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ప్రస్తుతం
సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో.. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందనేది సస్పెన్స్ గా
మారింది. ఏపీ, తెలంగాణలో ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన వసూళ్లు (షేర్) ఇలా ఉన్నాయి.

నైజాం – 1.14 కోట్లు
సీడెడ్ – 61 లక్షలు
ఉత్తరాంధ్ర – 40 లక్షలు
ఈస్ట్ – 10 లక్షలు
వెస్ట్ – 21 లక్షలు
గుంటూరు – 17.2 లక్షలు
కృష్ణా – 7 లక్షలు
నెల్లూరు – 6 లక్షలు