రెడ్ మూవీ మొదటి రోజు వసూళ్లు

Ram RED Movie Day-1 Collection (1)

రామ్ హీరోగా నటించిన సినిమా రెడ్. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నివేత
పెతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ
సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి.

ఆంధ్రప్రదేశ్, నైజాంలో రెడ్ సినిమాకు మొదటిరోజు ఏకంగా 6 కోట్ల 70 లక్షల రూపాయల షేర్ వచ్చింది.
50 శాతం ఆక్యుపెన్సీతో, తక్కువ థియేటర్లతో ఈ స్థాయి వసూళ్లు అంటే చెప్పుకోదగ్గ విషయమే.

అయితే ఇదే ఊపు మరికొన్ని రోజులు కొనసాగే పరిస్థితి లేదు. ఎందుకంటే రెడ్ సినిమాకు ఫ్లాప్ టాక్
వచ్చేసింది. రివ్యూస్ కూడా ఏమంత ప్రోత్సాహకరంగా లేవు. దీంతో రాబోయే రోజుల్లో ఈ సినిమా రివకర్
అవుతుందా అవ్వదా అనేది ఆసక్తికరంగా మారింది.

తెలుగు రాష్ట్రాల్లో రెడ్ సినిమాకు మొదటి రోజు వచ్చిన వసూళ్లు (షేర్) ఇలా ఉన్నాయి
నైజాం – 2.19 కోట్లు
సీడెడ్ – 1.17 కోట్లు
నెల్లూరు – 36 లక్షలు
గుంటూరు – 46.5 లక్షలు
కృష్ణా – 35.3 లక్షలు
వెస్ట్ – 95.7 లక్షలు
ఈస్ట్ – 63.85 లక్షలు
ఉత్తరాంధ్ర – 53 లక్షలు