దుమ్ము దులుపుతున్న వకీల్ సాబ్ టీజర్

vakeel-saab-teaser

పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా కోసం అతడి ఫ్యాన్స్ తో పాటు చాలామంది
అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి కానుకగా విడుదలైన వకీల్ సాబ్
టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం యూట్యూబ్ లో ఇది టాప్-1 ట్రెండింగ్ లో
కొనసాగుతోంది.

ఈ టీజర్ కు ఇప్పటివరకు 7లక్షలకు పైగా వ్యూస్, మరో 7 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. పవన్ కల్యాణ్
కెరీర్ లోనే హయ్యస్ట్ కౌంట్ ఇది. ఈ పండగ సీజన్ దాటేసరికి వకీల్ సాబ్ టీజర్, సోషల్ మీడియాలో
సరికొత్త రికార్డు సృష్టిస్తుందని అంతా అంచనా వేస్తున్నారు.

పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీ ఇది. శ్రీరామ్ వేణు డైరక్ట్ చేస్తున్న ఈ సినిమా శాటిలైట్ హక్కుల్ని జీ తెలుగు ఛానెల్ దక్కించుకుంది. సమ్మర్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రాబోతున్నాడు వకీల్ సాబ్.