లాభాల్లోకి ఎంటరైన క్రాక్

krack

రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా సంక్రాంతి విజేతగా నిలిచింది. బరిలో 4 సినిమాలు ఉండగా.. క్రాక్
మాత్రమే సంక్రాంతి హిట్ అనిపించుకుంది. తాజాగా ఈ సినిమా బ్రేక్-ఈవెన్ క్రాస్ చేసి, లాభాల బాట
పట్టింది. విడుదలైన 6 రోజుల్లో క్రాక్ సినిమాకు అటుఇటుగా 21 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. అలా
డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవ్వడంతో పాటు.. 3 కోట్ల 50 లక్షల రూపాయల లాభాన్ని అందించింది ఈ మూవీ.

మిగతా సినిమాలన్నీ తేలిపోవడంతో ప్రస్తుతం జనాలంతా క్రాక్ మూవీపై పడ్డారు. మిగతా సినిమాలు
చూడడం కంటే, క్రాక్ మూవీ చూడడం బెటరని అంతా డిసైడ్ అయిపోయారు. దీంతో ఈ 2 రోజులు రవితేజ సినిమాకు మరిన్ని వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అటు క్రాక్ సినిమా డిజిటల్ రైట్స్ ను ఆహా ఓటీటీ దక్కించుకుంది. దాదాపు 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకుంది. ఆహా చరిత్రలో ఓ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ కోసం ఖర్చుపెట్టిన పెద్ద మొత్తం ఇదే.