బన్నీ సరసన బాలీవుడ్ బ్యూటీ

saiee manjreker

త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు అల్లు అర్జున్. ఈ మూవీని
అధికారికంగా ప్రకటించారు కూడా. ఇప్పుడీ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయింది. అన్నీ అనుకున్నట్టు
జరిగితే సయీ మంజ్రేకర్ ను బన్నీ-కొరటాల సినిమాలో హీరోయిన్ గా తీసుకునే ఛాన్స్ ఉంది.

ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న బాక్సర్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది సయీ
మంజ్రేకర్. దీంతో పాటు అడవి శేష్ హీరోగా వస్తున్న మేజర్ సినిమాలో కూడా నటిస్తోంది. ఇప్పుడు ఏకంగా
బన్నీ సినిమాలో ఛాన్స్ దక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది.

సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు బన్నీ. ఇది పూర్తవ్వడానికి మరో 6 నెలలు
పడుతుంది. ఆ తర్వాత కొరటాల శివతో సినిమా స్టార్ట్ చేస్తాడు అల్లు అర్జున్. కొరటాల-బన్నీ కాంబినేషన్
లో ఇదే తొలి సినిమా కాబోతోంది.