రేపే ఫైటర్ ఫస్ట్ లుక్

vijay devarakonda fighter movie bankong schedule

ముంబయిలో కరోనా ఏ స్థాయిలో విజృంభించిందో అందరం చూశాం. అలాంటి నగరంలో షూటింగ్ పెట్టుకున్న విజయ్ దేవరకొండ, కరోనా మొదలైన తొలినాళ్లలోనే తన కొత్త సినిమా షూటింగ్ ను ఆపేశాడు. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ.. సెట్స్ పైకి వెళ్లలేని పరిస్థితి. ఎందుకంటే, ఈ సినిమాకు సంబంధించి ఫారిన్ టెక్నీషియన్స్, కొంతమంది ఫారిన్ ఆర్టిస్టులు కావాలి. వాళ్లు విదేశాల నుంచి వచ్చే పరిస్థితి లేదు.

దీంతో పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబోలో రావాల్సిన సినిమా ఆలస్యం అవుతోంది. మరోవైపు ఈ సినిమాను ప్రేక్షకులు కూడా క్రమక్రమంగా మరిచిపోతున్నారు. అందుకే సినిమాకు ఇంకాస్త బజ్ తీసుకొచ్చేందుకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. రేపు ఉదయం 10 గంటల 8 నిమిషాలకు విజయ్ దేవరకొండ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుంది.

ఈ మూవీకి ఫైటర్ అనే టైటిల్ అనుకుంటున్నారు. అదే టైటిల్ ఫిక్స్ చేస్తారా లేక మరో టైటిల్ పెడతారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అంతేకాదు.. రేపు ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ రిలీజ్ చేస్తారా చేయరా అనేది కూడా తేలలేదు. చార్మి నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో అనన్య పాండే టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమౌతోంది. సినిమాలో విజయ్ దేవరకొండ తల్లిగా రమ్యకృష్ణ నటిస్తోంది.