Telugu Global
Health & Life Style

ఎండ తగిలితే కొవ్వు కరుగుతుంది

బరువు తగ్గాలనుకుంటున్నారా అయితే.. పెద్దపెద్ద ఎక్సర్ సైజులు ఏవీ అవసర్లేదు. సింపుల్‌గా రోజూ కాసేపు ఎండలో నిల్చుంటే సరిపోతుంది అంటున్నాయి స్టడీలు. రోజూ ఉదయం, సాయంత్రం ఎండలో నిల్చోడం వల్ల బరువు తగ్గొచ్చని రీసెంట్ స్టడీలు చెప్తున్నాయి. సూర్యుడి నుంచి వచ్చే కాంతి శరీరంలో కొవ్వులను క‌రిగించేందుకు మెరుగ్గా పనిచేస్తుందని యూనివర్శిటీ ఆఫ్ అల్బెర్టా ఫాకల్టీ ఆఫ్ మెడిసిన్ అండ్ డెంటిస్ట్రీ అధ్యయనం చెప్తుంది. ఎండ మంచిదే ఉదయం ఏడు నుంచి పది గంటల వరకు, అలాగే […]

ఎండ తగిలితే కొవ్వు కరుగుతుంది
X

బరువు తగ్గాలనుకుంటున్నారా అయితే.. పెద్దపెద్ద ఎక్సర్ సైజులు ఏవీ అవసర్లేదు. సింపుల్‌గా రోజూ కాసేపు ఎండలో నిల్చుంటే సరిపోతుంది అంటున్నాయి స్టడీలు.

రోజూ ఉదయం, సాయంత్రం ఎండలో నిల్చోడం వల్ల బరువు తగ్గొచ్చని రీసెంట్ స్టడీలు చెప్తున్నాయి. సూర్యుడి నుంచి వచ్చే కాంతి శరీరంలో కొవ్వులను క‌రిగించేందుకు మెరుగ్గా పనిచేస్తుందని యూనివర్శిటీ ఆఫ్ అల్బెర్టా ఫాకల్టీ ఆఫ్ మెడిసిన్ అండ్ డెంటిస్ట్రీ అధ్యయనం చెప్తుంది.

ఎండ మంచిదే
ఉదయం ఏడు నుంచి పది గంటల వరకు, అలాగే సాయంత్రం నాలుగు నుంచి సూర్యాస్తమయం వరకు వచ్చే ఎండ తీవ్రత తక్కువగా ఉంటుంది. అయితే ఈ టైంలో ఎండ కంటే కూడా ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపు వచ్చే ఎండలో విటమిన్ D ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు చెప్తుంటారు. విటమిన్ D శరీరంలోని కొవ్వు కణాలను కరిగిస్తుంది. సూర్యూడి నుంచి వచ్చే అల్ట్రా వయొలెట్ కిరణాలు శరీరాన్ని తాకగానే కొవ్వు కణాలు కరిగే ప్రక్రియ మొదలవుతుంది. అంతేకాదు విటమిన్ D ఎక్కువగా ఉండే ఆహారం తీసుకున్నా కూడా బరువు తగ్గే వీలుందంటున్నారు డాక్టర్లు. అందుకే విటమిన్ D కోసం గుడ్లు, చేపలు ఎక్కువగా తినాలి.

పది నిముషాలు చాలు
ఉదయం పది నుంచి సాయంత్రం లోపు ఎండ తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు కనీసం పది నుంచి పదిహేను నిముషాలు ఎండలో నిల్చోవాలి. అదే చలికాలంలో అయితే అర్ధగంట పాటు ఉండొచ్చు. ఎండలో ఉంటే మంచిది కదా అని ఎక్కువసేపు ఎండలో నిల్చుంటే ప్రమాదమే.. సూర్యరశ్మి ఎక్కువగా తాకడం వల్ల చర్మం పాడయ్యే ప్రమాదముంది. అందుకే రోజుకు పది నుంచి పదిహేను నిముషాల పాటు మాత్రమే నిల్చోవాలి.

First Published:  17 Jan 2021 5:40 AM GMT
Next Story