Telugu Global
Cinema & Entertainment

సమ్మర్ లో సినిమాలు షురూ..

మొన్నటి వరకూ కోవిడ్ తో కొత్త సినిమాల సందడి తగ్గిపోయింది. ప్రతిసారి సంక్రాంతికి సినిమాల జోరు మొదలయ్యేది. కానీ ఈ సారి కూడా రెండు మూడు సినిమాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఈ సమ్మర్ కు మాత్రం అలా కాదు. వరుసగా సినిమాల జాతర మొదలుకానుంది. ఈ సమ్మర్ కు రిలీజ్ అవ్వబోతున్న సినిమాలేంటంటే.. ఫిబ్రవరి ఫిబ్రవరి 5న లో మెగా ఫ్యామిలీ కొత్త హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ఉప్పెన రిలీజ్ కాబోతోంది. ఈ […]

సమ్మర్ లో సినిమాలు షురూ..
X

మొన్నటి వరకూ కోవిడ్ తో కొత్త సినిమాల సందడి తగ్గిపోయింది. ప్రతిసారి సంక్రాంతికి సినిమాల జోరు మొదలయ్యేది. కానీ ఈ సారి కూడా రెండు మూడు సినిమాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఈ సమ్మర్ కు మాత్రం అలా కాదు. వరుసగా సినిమాల జాతర మొదలుకానుంది. ఈ సమ్మర్ కు రిలీజ్ అవ్వబోతున్న సినిమాలేంటంటే..

ఫిబ్రవరి
ఫిబ్రవరి 5న లో మెగా ఫ్యామిలీ కొత్త హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ఉప్పెన రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా గత పది నెలలుగా రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంది. అలాగే ఫిబ్రవరి 12న సందీప్ కిషన్ ఏ1 ఎక్స్‌ప్రెస్, సాయికుమార్ తనయుడు ఆది నటించిన శశి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

మార్చి
మార్చిలో కూడా మూవీస్ రెడీగా ఉన్నాయి. రానా ప్రధాన పాత్రలో మూడు భాషల్లో రూపొందిన అరణ్య మార్చి 26 రిలీజ్ అవ్వబోతోంది.
రీసెంట్‌గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న నాగ చైతన్య-శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ అలాగే నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన రంగ్ దే సినిమాలు కూడా మార్చి 26 నే థియేటర్లకు రాబోతున్నాయి.

ఇవి కూడా
ఇకపోతే.. నాని-శివ నిర్వాణ కాంబినేషన్ మూవీ టక్ జగదీష్ ఏప్రిల్ 16న రిలీజ్ అవ్వబోతోంది. అలాగే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న రానా, సాయి పల్లవి విరాటపర్వం కూడా సమ్మర్ రిలీజ్ అని అనౌన్స్‌ చేశారు.
అలాగే అక్కినేని అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, శర్వానంద్ శ్రీకారం కూడా సమ్మర్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక వీటన్నింటితో పాటు సమ్మర్ లో రెండు భారీ సినిమాలు కూడా రీలీజ్ అయ్యే అవకాశం ఉంది. పవర్‌స్టార్ వకీల్ సాబ్ తో పాటు మెగాస్టార్ ఆచార్య కూడా ఈ లిస్ట్ లో ఉన్నాయి. వకీల్ సాబ్ మే నెలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ చెప్తోంది. అలాగే మెగాస్టార్ ఆచార్య కూడా జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ డేట్ అయిన మే 9న సెంటిమెంట్‌గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

First Published:  18 Jan 2021 4:24 AM GMT
Next Story