పవన్ కల్యాణ్ నుంచి మరో సినిమా

వరుసపెట్టి సినిమాలు చేస్తున్న పవన్ కల్యాణ్, ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడు. ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు పవర్ స్టార్. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి కథాచర్చలు మొదలయ్యాయి.

వకీల్ సాబ్ సినిమాను పూర్తిచేసిన పవన్.. ఈ నెలలోనే అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ ను స్టార్ట్ చేస్తాడు. దీంతో పాటు క్రిష్ సినిమాను కంప్లీట్ చేస్తాడు. ఆ తర్వాత హరీష్ శంకర్ మూవీ లైన్లో ఉంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత సురేందర్ రెడ్డి సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి.

ప్రస్తుతానికైతే సామాజిక సందేశం ఇచ్చే ఓ లైన్ పై ఇద్దరూ వర్క్ చేస్తున్నారు. కొన్ని రోజుల ట్రావెల్ తర్వాత ఈ లైన్ అంత ఆసక్తికరంగా అనిపించకపోతే.. మరో లైన్ పై ఫ్రెష్ గా కథాచర్చలు మొదలుపెడతారు. స్టోరీ ఏదైనా సినిమా చేయడం మాత్రం పక్కా.

తన సినిమాల ద్వారా 300 కోట్ల రూపాయలు ఆర్జించబోతున్నాడట పవన్ కల్యాణ్. సినిమాకు 60 కోట్ల రూపాయల మేరకు ఛార్జ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.