రాధేశ్యామ్ యూనిట్ కు ప్రభాస్ గిఫ్ట్

తనతో కలిసి పనిచేస్తున్న యూనిట్ కు బహుమతులు ఇచ్చే అలవాటును ఈమధ్యనే నేర్చుకున్నాడు
హీరో ప్రభాస్. ఆ మధ్య సాహో యూనిట్ కు బహుమతులు అందించాడు. ఇప్పుడు రాధేశ్యామ్ యూనిట్
కు కూడా గిఫ్టులు ఇచ్చాడు. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. దీంతో షూట్ ఆఖరి రోజున..
యూనిట్ లో సభ్యులందరికీ వాచీలు బహుకరించాడు ప్రభాస్

రాధేశ్యామ్ యూనిట్ లో ఉన్న 200 మందికి ప్రభాస్ నుంచి బహుమతిగా వాచీలు అందాయి. ఒక్కో వాచీ
ఖరీదు దాదాపు 15వేల రూపాయలు. ఊహించని విధంగా ప్రభాస్ నుంచి బహుమతి రావడంతో యూనిట్
జనాలంతా ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

ఈ బహుమతుల సంగతి పక్కనపెడితే.. దాదాపు ఏడాదిన్నర సుదీర్ఘ విరామం తర్వాత రాధేశ్యామ్ సినిమా
పూర్తవ్వడంతో ప్రభాస్ అబిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికైనా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ను
తొందరగా పూర్తిచేసి, థియేటర్లలో రిలీజ్ చేయాలని కోరుతున్నారు.

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.
జిబ్రాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.