Telugu Global
Health & Life Style

ఎవరెవరికి ఎంత వ్యాయామం?

ఇప్పుడు చాలామంది ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. దాంతో ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్‌సైజ్‌లకు జనం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అయితే వర్కవుట్స్ సరిపడినంత చేయకపోయినా.. అలాగని ఎక్కువగా చేసినా ప్రమాదమే.. అందుకే రోజుకు ఎవరెవరు ఎంత సమయం ఫిజకల్ యాక్టివిటీ చేస్తే మంచిదో డబ్ల్యూహెచ్‌వో గైడెన్స్ ఇచ్చింది. డబ్ల్యూహెచ్‌వో ప్రకారం ఫిజికల్ యాక్టవిటీ లేకపోవడం వల్ల సంవత్సరానికి ఐదు మిలియన్ల మంది చనిపోతున్నారు. సాధారణంగా ఫిజికల్ ఎక్సర్‌సైజ్ అనేది ఒక్కో వయసువారికి ఒక్కొ విధంగా ఉండాలి. దీనిపై […]

ఎవరెవరికి ఎంత వ్యాయామం?
X

ఇప్పుడు చాలామంది ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. దాంతో ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్‌సైజ్‌లకు జనం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అయితే వర్కవుట్స్ సరిపడినంత చేయకపోయినా.. అలాగని ఎక్కువగా చేసినా ప్రమాదమే.. అందుకే రోజుకు ఎవరెవరు ఎంత సమయం ఫిజకల్ యాక్టివిటీ చేస్తే మంచిదో డబ్ల్యూహెచ్‌వో గైడెన్స్ ఇచ్చింది.

డబ్ల్యూహెచ్‌వో ప్రకారం ఫిజికల్ యాక్టవిటీ లేకపోవడం వల్ల సంవత్సరానికి ఐదు మిలియన్ల మంది చనిపోతున్నారు. సాధారణంగా ఫిజికల్ ఎక్సర్‌సైజ్ అనేది ఒక్కో వయసువారికి ఒక్కొ విధంగా ఉండాలి. దీనిపై డబ్ల్యూహెచ్‌వో ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటంటే..

  • 5 నుంచి 17 సం.
    లేటెస్ట్ గైడ్ లైన్స్ ప్రకారం 5 నుంచి 17 మధ్య వయసు ఉన్న పిల్లలకు, టీనేజ్ వాళ్లకు రోజు మొత్తంలో సుమారు గంట పాటైనా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. పనికట్టుకుని వర్కవుట్స్ చేయకపోయినా.. ఏదో ఒక రూపంలో గంట పాటు శారీరక శ్రమ ఉండాలి.
    ఈ వయసు వాళ్లు తేలికపాటి వ్యాయామాలు, ఏరోబిక్స్, స్పోర్ట్స్ లాంటివి చేయొచ్చు. ఇలా చేయడం వల్ల ఈ వయసు వాళ్లలో ఫిట్‌నెస్, కార్డియో స్ట్రెంత్ మెరుగుపడతాయి. కండరాలు, ఎముకలు బలంగా తయారవుతాయి. బీపీ, షుగర్ లాంటివి రాకుండా ఉంటాయి.
  • 18 నుంచి 64 సం.
    18 నుంచి 64 వయసు ఉండే వాళ్లు రోజులో కనీసం మూడు గంటల పాటు ఏదో ఒక శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. లేదా వారానికి 20 నుంచి 25 గంటల ఫిజికల్ యాక్టివిటీ ప్లాన్ చేసుకోవాలి.
    ఈ వయసు వాళ్లు ఎలాంటి వ్యాయామాలైనా చేయొచ్చు. అయితే వర్కవుట్స్ లో కార్డియో, వెయిట్ లిఫ్టింగ్ వ్యాయామాలు కూడా ఉంటే మంచిది.
    ఫిజికల్ యాక్టివిటీ లేని సెడెంటరీ లైఫ్‌స్టైల్ వల్ల మధ్యవయసు వాళ్లలో టైప్ 2 డయాబెటిస్, కార్డియో వస్కులర్ డిసీజెస్ వల్ల ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నట్టు డబ్ల్యూహెచ్‌వో చెప్తోంది.
  • గర్భిణీలు, పాలిచ్చే తల్లులు
    ప్రెగ్నెంట్ విమెన్, పాలిచ్చే తల్లులు ఎంతోకొంత శారీరక శ్రమ చేయడం వల్ల తల్లీ బిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉండొచ్చు. వీళ్లు కనీసం వారంలో మూడు గంటల శారీరక శ్రమ అయినా ఉండేలా చూసుకోవాలి. వీళ్లు స్ట్రెచింగ్, మజిల్ బిల్డింగ్ వ్యాయామాలు చేస్తే మంచిది.
    ఇలా చేయడం వల్ల గర్భిణీలు, పాలిచ్చే తల్లుల్లో.. ప్రీ ఎక్లాంప్సియా, హైపర్ టెన్షన్, డిప్రెషన్ డయాబెటిస్ లాంటివి వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
  • దీర్ఘ వ్యాధులు ఉన్నవాళ్లు
    హైపర్ టెన్షన్, టైప్2 డయాబెటిస్, హెచ్‌ఐవీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్లకు ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎంతగానో ఉపయోపడుతుంది. వీళ్లు కూడా వారంలో మూడు నుంచి ఐదు గంటల పాటు వ్యాయామం చేయాలి.
  • డిజేబిలిటీ ఉన్నవాళ్లు
    డిజేబిలిటీ ఉన్న పిల్లలకు కనీసం రోజులో గంట సేపైనా వ్యాయామం చేయించాలి. మరీ కష్టతరమైన వ్యాయామాలు కాకుండా తేలికపాటి వ్యాయామాలు చేయించాలి. దీనివల్ల వాళ్లలో క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ పెరుగుతుంది. శరీర కదలికలు మెరుగుపడతాయి.
First Published:  19 Jan 2021 7:20 AM GMT
Next Story