Telugu Global
NEWS

ఎన్నికలపై ఎడతెగని పంచాయితీ..

ఏపీలో పంచాయతీ ఎన్నికలపై ఎడతెగని పంచాయితీ నడుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ఫుల్ బెంచ్ ముందు ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ సవాల్ చేయడంతో వాదనలు కొనసాగుతున్నాయి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిన తర్వాత అందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. పంచాయతీ ఎన్నికలను నిలిపివేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధమన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎన్నికల […]

ఎన్నికలపై ఎడతెగని పంచాయితీ..
X

ఏపీలో పంచాయతీ ఎన్నికలపై ఎడతెగని పంచాయితీ నడుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ఫుల్ బెంచ్ ముందు ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ సవాల్ చేయడంతో వాదనలు కొనసాగుతున్నాయి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిన తర్వాత అందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. పంచాయతీ ఎన్నికలను నిలిపివేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధమన్నారు.

వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎన్నికల నిర్వహణపై ప్రభావం చూపదనే నిర్ణయానికి వచ్చాకే జనవరి 8న కమిషన్ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిందని, సింగిల్‌ జడ్జి ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎన్నికల్ని నిలిపివేశారని కోర్టుకి తెలియజేశారు. మొదటి కేటగిరి కింద ప్రస్తుతం ఆరోగ్యశాఖ సిబ్బందికి మాత్రమే టీకాలు ఇస్తున్నారని, మూడో కేటగిరీ కింద ఎక్కువ మందికి టీకా ఇచ్చేందుకు సమయం పడుతుందని, ఆలోగా ఎన్నికలు జరపొచ్చిని వాదించారు. ఎన్నికలు నిర్వహించడం వల్ల కమిషనర్ ‌కు వ్యక్తిగత లబ్ధి ఏముంటుందని, వారి బంధువులెవరూ పోటీ చేయడం లేదు కదా అని ప్రశ్నించారు కూడా. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు ఎస్ఈసీ తరపు న్యాయవాదులు.

ప్రభుత్వం వాదన ఇదీ..
సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై ఎస్‌ఈసీ వేసిన అప్పీల్ ‌కు విచారణార్హతే లేదని అన్నారు అడ్వొకేట్ జనరల్ ఎన్.శ్రీరామ్. సంప్రదింపుల విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టుల ఆదేశాల్ని ఎస్‌ఈసీ పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. 23 శాఖలు సహా ప్రభుత్వ యంత్రాంగమంతా టీకాలిచ్చే కార్యక్రమంలో పాల్గొనాలని, ఇది ఎన్నికల నిర్వహణను పోలి ఉంటుందని చెప్పారు. ఓవైపు టీకాలిచ్చే కార్యక్రమం, మరోవైపు ఎన్నికల నిర్వహణ కష్టమన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఎన్నికల్ని వాయిదా వేయాలని కోరారు.

కేంద్రం అఫిడవిట్ కి సమయం లేదు..
ఇదే కేసులో కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయ సొలిసిటర్‌ జనరల్‌ కూడా తమ‌ వాదనలు వినిపించారు. టీకా, ఎన్నికల నిర్వహణ రెండింటినీ ఏకకాలంలో నిర్వహించగలిగితే కేంద్రానికి అభ్యంతరం లేదని అన్నారాయన. వివరాలతో అఫిడవిట్‌ వేయడానికి సమయం ఇవ్వాలని కోరగా.. నోటిఫికేషన్‌ ప్రకారం ఈ నెల 23 నుంచి మొదటి విడత ఎన్నికల షెడ్యూల్‌ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో గడువివ్వలేమని ధర్మాసనం పేర్కొంది. విచారణను నేటికి వాయిదా వేసింది.

First Published:  19 Jan 2021 1:17 AM GMT
Next Story