పవన్ సినిమాలో హాట్ యాంకర్

యాంకర్ అనసూయ మొన్నటివరకు టీవీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. సినిమాలకు తక్కువ
ప్రయారిటీ ఇచ్చింది. సినిమా కథల విషయంలో ఆమె గిరి గీసుకుంది. అందుకే అవకాశాలు తగ్గాయి. కానీ
ఇప్పుడు అనసూయ సినిమాలపై పూర్తి దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగా వరుసపెట్టి
సినిమాలకు కమిట్ అవుతోంది.

ఇప్పటికే సునీల్ హీరోగా రాబోతున్న వేదాంతం రాఘవయ్య మూవీలో అనసూయ నటిస్తోంది. దీంతోపాటు
రవితేజ ఖిలాడీలో కూడా ఆమె కనిపించనుంది. అటు విజయ్ సేతుపతి హీరోగా వస్తున్న ఓ తమిళ
సినిమాలో కూడా అనసూయ ఉంది. ఇప్పుడు వీటికి అదనంగా పవన్ కల్యాణ్ మూవీలో కూడా
కనిపించనుంది ఈ బ్యూటీ.

పవన్-క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో ఓ కీలక పాత్రలో అనసూయను తీసుకున్నట్టు ప్రచారం
నడుస్తోంది. రీసెంట్ గా అనసూయకు తన పాత్రకు సంబంధించి నెరేషన్ ఇచ్చాడట దర్శకుడు క్రిష్.
క్యారెక్టర్ నచ్చడంతో అనసూయ వెంటనే అంగీకరించిందని టాక్.