బంగారు బుల్లోడు దూసుకొస్తున్నాడు

bangaru-bullodu

లాంగ్ గ్యాప్ తర్వాత మరో కామెడీ సినిమాతో మనముందుకొస్తున్నాడు అల్లరి నరేష్. అతడు నటించిన
తాజా చిత్రం బంగారు బుల్లోడు. సినిమా మొత్తం కామెడీ ఉంటుందంటున్నాడు ఈ హీరో. పూజా జవేరి
హీరోయిన్ గా ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై గిరి పాలిక దర్శకత్వంలో రామబ్రహ్మం
సుంకర నిర్మించిన చిత్రం ఇది.

జనవరి 23న సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా తాజాగా ట్రయిలర్ రిలీజ్ చేశారు.
ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఈ ఈవెంట్ కు అల్లరి నరేశ్, పూజా జవేరి, కమెడియన్స్ ప్రభాస్ శ్రీను, భద్రం
తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన అల్లరినరేష్.. గతంలో బాలయ్య నటించిన బంగారు బుల్లోడు సినిమాకు తన చిత్రానికి ఎలాంటి కనెక్షన్ లేదని ప్రకటించాడు.

“బాలకృష్ణ గారి బంగారు బుల్లోడు కి మా చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు. ఒక బంగారు షాప్ లో వర్క్
చేస్తూ గ్రామీణ బాంక్ లో పనిచేసే వాడి కథ ఇది. బంగారం తాకట్టు పెట్టుకొని రుణాలు ఇస్తుంటాడు.
అందుకే ఈ సినిమాకి బంగారు బుల్లోడు టైటిల్ పెట్టడం జరిగింది. అడగ్గానే ఈ టైటిల్ ఇచ్చిన బాలకృష్ణ
గారికి, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ కి నా థాంక్స్.. సాయి కార్తీక్ సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చాడు. స్వాతిలో
ముత్యమంత సాంగ్ రీమేక్ చేశాడు.”