Telugu Global
Others

మన డేటా మన చేతుల్లో

ఇటీవల ఆన్‌లైన్‌లో, సోషల్ మీడియాలో.. ఎక్కడ చూసినా ప్రైవసీ అనేది పెద్ద సమస్యగా మారింది. మన డేటా అసలు సేఫ్‌గా ఉంటోందా..? ఎవరైనా మన యాక్టివిటీస్‌ను ట్రాక్ చేస్తున్నారా.. అనే భయాలు కలుగుతున్నాయి. అందుకే మన ప్రైవసీని సేఫ్‌గా ఎలా ఉంచుకోవాలో ఓ సారి చూద్దాం. మన మొబైల్స్, లేదా అకౌంట్స్ సరిగ్గా భద్రపరుచుకోపోతే.. అవి హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోవచ్చు. పర్సనల్ డేటా అంటే అది మన పర్సనల్ ఫొటోల నుంచి కాంటాక్ట్స్ వరకూ.. బ్యాంక్ అకౌంట్స్ […]

మన డేటా మన చేతుల్లో
X

ఇటీవల ఆన్‌లైన్‌లో, సోషల్ మీడియాలో.. ఎక్కడ చూసినా ప్రైవసీ అనేది పెద్ద సమస్యగా మారింది. మన డేటా అసలు సేఫ్‌గా ఉంటోందా..? ఎవరైనా మన యాక్టివిటీస్‌ను ట్రాక్ చేస్తున్నారా.. అనే భయాలు కలుగుతున్నాయి. అందుకే మన ప్రైవసీని సేఫ్‌గా ఎలా ఉంచుకోవాలో ఓ సారి చూద్దాం.
మన మొబైల్స్, లేదా అకౌంట్స్ సరిగ్గా భద్రపరుచుకోపోతే.. అవి హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోవచ్చు. పర్సనల్ డేటా అంటే అది మన పర్సనల్ ఫొటోల నుంచి కాంటాక్ట్స్ వరకూ.. బ్యాంక్ అకౌంట్స్ నుంచి క్రెడిట్ కార్డు వివరాల వరకూ ఇలా ఏదైనా కావొచ్చు. ఇలాంటివి మనం ఎంత సెక్యూర్డ్‌గా ఉంచుకుంటే అంత మంచిది.

అసలు మన డేటాను ఎలా భద్రంగా ఉంచుకోవాలంటే..
వ్యక్తిగత పాస్ వర్డులను మరిచిపోతామని ఫోన్‌లో సేవ్ చేసేస్తుంటారు చాలామంది. కానీ అలా చేయడం అంత మంచిది కాదు. బాగా గుర్తుండే పాస్ వర్డ్ ను పెట్టుకుని దాన్ని మనమే గుర్తుంచుకుని ప్రతిసారి ఎంటర్ చేయడం చాలావరకూ ఉత్తమం. అలాగే పాస్ వర్డ్ ఎప్పుడూ స్ట్రాంగ్ గా ఉండాలి. దాని కోస పాస్‌వర్డ్ లో ఒక అప్పర్ లెటర్ ఆల్ఫాబెట్, ఒక నెంబర్, ఒక సింబల్ ఉండేలా చూసుకోవాలి. అలాగే ఇప్పుడొస్తున్న ఫింగర్ ప్రింట్, ఫేస్ పాస్ వర్డ్ లు కూడా అంత సేఫ్ కాదని సైబర్ నిపుణులు చెప్తున్నారు. ఎప్పుడైనా పాస్ వర్డ్ అనేది మన మెదడులో సేవ్ అయ్యి ఉంటేనే అది ఇతరులకు తెలియకుండా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే అల్ఫా న్యూమరిక్ పాస్ వర్డ్ ఎంతో సెక్యూర్.

పర్సనల్ ఫొటోలు, వీడియోలు
మనలో చాలామంది పర్సనల్ ఫోటోల్ని సోషల్ మీడియా అకౌంట్లో ప్రైవేట్ గా దాచుకుంటారు. ఇది కూడా పెద్ద మిస్టేక్ అంటున్నారు నిపుణులు. పర్సనల్ అనుకున్న డిజిటల్ డేటా మొత్తాన్ని సోషల్ మీడియా నుంచి తీసివేసి ఎక్స్‌టర్నల్ హార్డ్ డిస్క్ లేదా పర్సనల్ కంప్యూటర్లో సేవ్ చేసుకోవడం బెటర్.

ఇవి అస్సలు వద్దు
చాలామంది ఫొటోలతో పాటు ఎప్పుడైనా అవసరం వస్తాయి కదా అని. ఆధార్ కార్డులు, పర్సనల్ ఐడీలు, క్రెడిట్ కార్డులు స్కాన్ చేసి ఆన్ లైన్ లో సేవ్ చేస్తుంటారు. ఇలాంటి వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లౌడ్ డేటాలో స్టోర్ చేయకూడదు. మనం ఆన్‌లైన్‌లో సేవ్ చేసే ప్రతీది క్లౌడ్ డేటా కిందకు వస్తుంది. అలాగే ఆఫీస్ సిస్టమ్స్‌లో.. లేదా పక్కవాళ్ల మొబైల్స్‌లో కూడా మీకు సంబంధించిన డేటా ఏదీ లేకుండా చూసుకోవాలి.

పర్మిషన్స్ ఇవ్వొద్దు
అలాగే ఒకసారి మొబైల్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి అన్ని యాప్స్ పర్మిషన్స్ కు వెళ్లి.. ఏయే యాప్ కు ఏయే పర్మిషన్స్ ఇచ్చారో చెక్ చేసుకోవాలి. అవసరం లేదనుకున్న పర్మిషన్స్ ను తీసేయాలి. ఉదాహరణకు ఓలా, స్విగ్గి లాంటి యాప్స్.. లొకేషన్ పర్మిషన్ అడిగినప్పుడు ఇవ్వాలి. అందులో తప్పులేదు. ఎందుకంటే వాటికి లొకేషన్ అవసరం ఉంటుంది. నేవిగేషన్ ద్వారానే మీకు సేవలందించ గలవు. అలా కాకుండా.. కొన్ని సోషల్ మీడియా యాప్స్ మైక్రో ఫోన్ యాక్సెస్ ను అడుగుతాయి. కొన్ని కాంటాక్ట్స లిస్ట్ పర్మిషన్‌ను అడుగుతాయి. మనం కూడా యాప్ ఇన్ స్టాల్ చేసేటప్పుడు చూసుకోకుండా అన్నింటికీ ఓకే నొక్కేస్తాం. ఇలా కొన్ని యాప్స్ అవసరం లేని పర్మిషన్స్ అడగడం వల్ల మన ప్రైవసీ ఎవరో చేతుల్లోకి వెళ్తుంది. అందుకే ఒకసారి సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఏయే యాప్ కు ఏ పర్మిషన్స్ అవసరమో ఉంచి మిగతావి డిజేబుల్ చేయాలి.

First Published:  20 Jan 2021 3:28 AM GMT
Next Story