బంగారు బుల్లోడులో స్కామ్

allari naresh

అల్లరినరేష్ హీరోగా తెరకెక్కిన సినిమా బంగారు బుల్లోడు. ఈ శనివారం సినిమా థియేటర్లలోకి వస్తోంది. సినిమా అంతా సరదాగా ఉంటుందనేది అందరికీ తెలిసిందే. మరి ఇలాంటి సినిమాలోకి సీరియస్ సబ్జెక్ట్ స్కామ్ అనే అంశం ఎలా వచ్చింది. అల్లరి నరేష్ దీనికి సమాధానం చెబుతున్నాడు.

“రాజమండ్రిలో జరిగిన ఓ గోల్డ్ స్కామ్ ను ఆధారంగా చేసుకొని డైరెక్టర్ గిరి ఈ కథ రాసుకున్నాడు. ఆ ఇన్సిడెంట్ పేపర్ క్లిప్ చూసి తన స్టైల్ లో ఈ కథను సిద్దం చేసుకొని పూర్తి ఎంటర్టైన్ మెంట్ సినిమాగా తీర్చిదిద్దారు.”

ఇలా బంగారు బుల్లోడు సినిమాలో బంగారం కుంభకోణం ఎలిమెంట్ దాగుందనే విషయాన్ని అల్లరోడు బయటపెట్టాడు. ఈ సినిమాలో తన పాత్ర గురించి కూడా వెల్లడించాడు.

“సినిమాలో గోల్డ్ తయారు చేసే గోల్డ్ స్మిత్ పాత్ర చేశాను. ఆ క్యారెక్టర్ కోసం కొంచెం హోమ్ వర్క్ చేశా. ఎందుకంటే ఇప్పుడంటే మిషన్స్ వచ్చాయి కానీ ఇది వరకు చేతులతోనే చేసేవారు. చేతితో చేసే చిన్న పనులు బాగా అబ్సర్వ్ చేసి నేర్చుకొని ఈ క్యారెక్టర్ చేశాను. నాకు తెలిసి ఏదైనా సినిమాలో జస్ట్ చిన్న ఎలిమెంట్ కోసం ఎవరైనా ఈ పాత్ర చేసి ఉండొచ్చు కానీ పూర్తి స్థాయిలో గోల్డ్ స్మిత్ పాత్ర చేసింది నేనే అనుకుంటున్నా.”

రీసెంట్ గా ఈ సినిమా ట్రయిలర్ రిలీజైంది. అందులో బంగారు పనివాడిగా అల్లరినరేష్ కు సంబంధించిన విజువల్స్ చూపించారు. కథ ఏదైనా, కామెడీకి మాత్రం ఢోకా ఉండదంటున్నాడు ఈ హీరో.