4 రోజుల ముందే ల్యాండ్ అయిన మహేష్

mahesh

హీరో మహేష్ దుబాయ్ లో ల్యాండ్ అయ్యాడు. అది కూడా ఒక్కడు కాదు. కుటుంబ సమేతంగా ఈ హీరో దుబాయ్ లో దిగాడు. ఇంతకీ ఇంత సడెన్ గా మహేష్ దుబాయ్ ఎందుకు వెళ్లాడో తెలుసా?

25వ తేదీ నుంచి సర్కారువారి పాట షూటింగ్ దుబాయ్ లో ప్రారంభం అవుతుంది. ఆ షూట్ లో పాల్గొనేందుకు, ఇలా 4 రోజుల ముందే దుబాయ్ లో దిగాడు మహేష్. కొన్ని రోజులు ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిన తర్వాత షూటింగ్ లో జాయిన్ అవుతాడు.

నిజానికి ఈ సినిమా షూటింగ్ ను అమెరికాలో ప్లాన్ చేశారు. కానీ అక్కడ పరిస్థితులు బాగాలేకపోవడంతో దుబాయ్ కు మార్చారు. అందుకే మహేష్ ఉన్నఫలంగా దుబాయ్ లో ల్యాండ్ అయ్యాడు. కొత్త హెయిర్ స్టయిల్ తో ఎయిర్ పోర్టులో మహేష్ దిగిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.