సలార్ సినిమా రీమేక్ కాదంట

prabhas salaar movie

సలార్ సినిమాను కొన్ని రోజుల కిందట ప్రకటించారు. తాజాగా సినిమాను లాంఛనంగా ప్రారంభించారు కూడా. ఈ రెండు సందర్భాల్లో కామన్ గా ఓ పుకారు వినిపించింది. అదేంటంటే.. సలార్ సినిమా ఓ రీమేక్. మరీ ముఖ్యంగా దర్శకుడు ప్రశాంత్ నీల్, తను గతంలో తీసిన ఉగ్రమ్ అనే సినిమానే సలార్ పేరిట రీమేక్ చేస్తున్నాడంటూ కథనాలు వచ్చాయి. ఎట్టకేలకు వీటిపై దర్శకుడు స్పందించాడు.

సలార్ సినిమా రీమేక్ కాదని స్పష్టంచేశాడు దర్శకుడు. పూర్తిగా ఇది కొత్త కథ అంటున్నాడు. తన సినిమాలో హీరో అమాయకంగా కనిపిస్తాడని, ఆ తర్వాత ఉగ్రరూపం దాలుస్తాడని చెప్పుకొచ్చాడు. ఉగ్రమ్ సినిమాలో ఉన్న అండర్ వరల్డ్ ఎలిమెంట్, సలార్ లో కూడా ఉన్నప్పటికీ.. ఈ రెండు సినిమాలకు ఎలాంటి పోలిక ఉండదంటున్నాడు ప్రశాంత్ నీల్.

ఈ నెలలోనే సలార్ ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ లో ఈ మూవీకి సంబంధించి భారీ సెట్ రెడీ అవుతోంది. ఓవైపు కేజీఎఫ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటూనే, మరోవైపు సలార్ మూవీ షూట్ చేయబోతున్నాడు ఈ డైరక్టర్.