Telugu Global
National

పోయస్ గార్డెన్ ను వీడేది లేదంటున్న శశికళ!

ఎంజీఆర్ అన్నా డీఎంకే పార్టీని స్థాపించిన కొత్తలో జయలలితకు వీడియో లైబ్రరీ నిర్వహిస్తున్న శశికళ పరిచయం అయ్యింది. ఆ తర్వాత వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అప్పటికే పెళ్ళైన శశికళ భర్తని కాదని జయలలిత వెంట ఉండటం ప్రారంభించింది. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జయ లలిత బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పోయస్ గార్డెన్లోని వేద నిలయంలో నివాసం ఉంటూ వచ్చారు. శశికళ కూడా ఆమె వెంటే అన్నేళ్లుగా అక్కడే ఉంది. అయితే జయలలిత మరణించిన తర్వాత జరిగిన […]

పోయస్ గార్డెన్ ను వీడేది లేదంటున్న శశికళ!
X

ఎంజీఆర్ అన్నా డీఎంకే పార్టీని స్థాపించిన కొత్తలో జయలలితకు వీడియో లైబ్రరీ నిర్వహిస్తున్న శశికళ పరిచయం అయ్యింది. ఆ తర్వాత వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అప్పటికే పెళ్ళైన శశికళ భర్తని కాదని జయలలిత వెంట ఉండటం ప్రారంభించింది. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జయ లలిత బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పోయస్ గార్డెన్లోని వేద నిలయంలో నివాసం ఉంటూ వచ్చారు. శశికళ కూడా ఆమె వెంటే అన్నేళ్లుగా అక్కడే ఉంది. అయితే జయలలిత మరణించిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో శశికళ జైలుపాలయ్యారు.

తన మద్దతుదారుడని భావించి ఎడప్పాడి పళని స్వామికి ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు అప్పగిస్తే.. ఆయన మాత్రం శశికళను పార్టీ నుంచి దూరం చేశారు. కాగా జయ నివసించిన ఇంటిని తమిళనాడు ప్రభుత్వం ప్రజల సందర్శనార్థం వేద నిలయంగా మార్చింది. ఈనెల 27వ తేదీన వేద నిలయాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది.

అలాగే మెరీనా తీరంలో జయ సమాధి వద్ద రూ.53 కోట్లతో జయ స్మారక మందిరం నిర్మించింది. ఈ స్మారక మందిరాన్ని కూడా 27వ తేదీనే ప్రభుత్వం ప్రారంభించనుంది. కాగా అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ కూడా 27వ తేదీనే జైలు నుంచి విడుదల కానున్నారు.

జైలు నుంచి విడుదలైన తర్వాత శశికళ తాను 30 ఏళ్లుగా ఉంటున్న పోయస్ గార్డెన్ లోనే నివాసం ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. తాను ఎక్కడైతే ఉంటూ రాజకీయాలను శాసించిందో అక్కడే ఉండాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం వేద నిలయం ఎదురుగా సుమారు 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనం నిర్మితమవుతోంది. ఈనెల 27వ తేదీన పరప్పన అగ్రహార జైలు నుంచి శశికళ విడుదల అవుతుండగా, అప్పటికి ఈ భవన నిర్మాణం పూర్తి కాకపోవచ్చన్న అనుమానంతో టీ నగర్ లో ఆమె బంధువుల ఇంటికి ఎదురుగా భవనాన్ని తాత్కాలికంగా శశికళ కోసం ఎంపిక చేశారు.

ప్రస్తుతానికి అక్కడి నుంచి ఆమె రాజకీయాలు నడిపిస్తారని తెలుస్తోంది. కాగా శశికళ మంగళవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.ముందు జ్వరంతో బాధపడుతున్న శశికళకు జైలు లోనే చికిత్స అందించారు. బుధవారం ఉదయం కల్లా శ్వాసకోశ సమస్య తీవ్రమవడంతో ఆమెను బెంగళూరు శివాజీ నగర్ లోని బౌరింగ్ లేడీ కర్జన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.

First Published:  21 Jan 2021 12:39 AM GMT
Next Story