మరో రీమేక్ పై కన్నేసిన సురేష్ బాబు

తన మూవీ బిజినెస్ అంతా తక్కువ రిస్క్ తోనే చేస్తానని సురేష్ బాబు ఇదివరకే ప్రకటించారు. రీమేక్ ప్రాజెక్టులు హ్యాండిల్ చేయడం కూడా ఇందులో భాగమే. ఈ క్రమంలో మరో మూవీ రీమేక్ రైట్స్ దక్కించుకున్నారు ఈ బడా నిర్మాత.

తాజాగా, కొరియన్ భాషకు చెందిన చిత్రం “లక్కీ కీ” అనే సినిమాకు అధికారికంగా రీమేక్ చేస్తున్నట్టుగా తెలిపారు. కామెడీ అండ్ క్రైమ్ ఎంటర్టైనర్ గా ఉండే ఈ మూవీకి సంబంధించి అన్ని ఇండియన్ భాషల రీమేక్ హక్కులను తాము కొనుగోలు చేసినట్టుగా వెల్లడించారు.

సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ వద్ద ఇప్పటికే డ్రీమ్ గర్ల్ రీమేక్ రైట్స్ ఉన్నాయి. రాజ్ తరుణ్ తో ఆ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడీ కొరియన్ సినిమా రీమేక్ ను ఏ హీరోతో తెరకెక్కిస్తారో చూడాలి.