Telugu Global
Others

తినడానికీ ఓ లెక్కుంది!

మీకు తెలుసా.. తినడం సరిగ్గా తెలియకపోవడం వల్లే చాలామంది అనారోగ్యం పాలవుతున్నారట. తినడం అంటే నచ్చింది తినడం కాదు. దానికీ ఓ లెక్కుంది. ఏది తినాలి? ఏ టైంకి తినాలి? ఎంత తినాలి? ఇవన్నీ సరిగ్గా తెలుసుకుంటేనే ఆరోగ్యం బాగుంటుంది. మనలో చాలామంది డైట్స్ చేస్తుంటారు. లావుగా ఉన్నామని ఫ్యాట్‌ను పూర్తిగా ఆపేయడం, కండలు రావాలని అచ్చంగా ప్రోటీన్స్ మాత్రమే తినడం ఇలాంటివి చేస్తుంటారు. కానీ రెగ్యులర్ ఫుడ్‌లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ రెండూ అవసరమే. ఏది ఎక్కువైనా, […]

తినడానికీ ఓ లెక్కుంది!
X

మీకు తెలుసా.. తినడం సరిగ్గా తెలియకపోవడం వల్లే చాలామంది అనారోగ్యం పాలవుతున్నారట. తినడం అంటే నచ్చింది తినడం కాదు. దానికీ ఓ లెక్కుంది. ఏది తినాలి? ఏ టైంకి తినాలి? ఎంత తినాలి? ఇవన్నీ సరిగ్గా తెలుసుకుంటేనే ఆరోగ్యం బాగుంటుంది.

మనలో చాలామంది డైట్స్ చేస్తుంటారు. లావుగా ఉన్నామని ఫ్యాట్‌ను పూర్తిగా ఆపేయడం, కండలు రావాలని అచ్చంగా ప్రోటీన్స్ మాత్రమే తినడం ఇలాంటివి చేస్తుంటారు. కానీ రెగ్యులర్ ఫుడ్‌లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ రెండూ అవసరమే. ఏది ఎక్కువైనా, తక్కువైనా సమస్యే. ఏది ఎంత ఉండాలో అంతే ఉండాలి. మాములుగా తినే విధానం ఎలా ఉండాలో ఓ సారి చూద్దాం.

మార్నింగ్ ఇలా..
నిద్ర లేవగానే బ్రేక్ ఫాస్ట్‌‌లో ప్రొటీన్లు కలిగిన పదార్థాలు ఉండాలి. దానికోసం గుడ్లు, శనగలు, స్ప్రౌట్స్, నట్స్ లాంటివి తినాలి. అలాగే కొబ్బరి నీళ్లు, గోధుమ గడ్డి లాంటివి కూడా ఉదయం పూట తీసుకోవచ్చు. దీంతోపాటు నిమ్మరసం, తెనెను వేడినీళ్లలో కలుపుకుని తాగినే మంచి ఉపయోగం ఉంటుంది.

లంచ్ కు..
ఆ తర్వాత లంచ్‌‌కి ముందు ఒక కప్పు మొలకెత్తిన గింజలు, ఒ‍క టీ స్పూన్‌‌ నానబెట్టిన వేరుశెనగలు తింటే మంచిది. అలాగే అన్నంలో వీలైనంత వరకూ కూరగాయలు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. పెరుగు కూడా కచ్చితంగా ఉండాలి. ఎప్పుడైనా ఓ సారి నాన్‌వెజ్ కూడా తినొచ్చు. కానీ వారానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు నాన్ వెజ్ తినడం అంత మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు.

సాయంత్రం..
లంచ్ అయిన తర్వాత నాలుగు గంటలైనా గ్యాప్ ఇవ్వాలి. సాయత్రం పూట కొద్దిగా ఫ్రూట్స్ తినాలి. సైజును బట్టి ఏవైనా రెండు ఫ్రూట్స్ తింటే మంచిది. ఇక వీటితో పాటు శ్నాక్స్ ఏవైనా తినాలనిపిస్తే.. తినొచ్చు. లైట్ ఫుడ్, బిస్కెట్స్, పిండి వంటలు లాంటివి కూడా తినొచ్చు. ఫ్రై చేసిన పదార్థాలను వీలైనంత వరకూ స్కిప్ చేస్తే బెటర్.

నైట్..
ఇక అన్నింటికంటే ముఖ్యమైన టైం సప్పర్ టైం. అదే రాత్రి భోజనం. రాత్రి భోజనం ఎలా ఉదనే దాన్ని బట్టి చాలా సమస్యలు రావడం లేదా తగ్గడం జరుగుతాయని డైట్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. రాత్రిపూట సప్పర్‌ను ఏడు లేదా ఎనిమిదింటికల్లా ముగించాలి. ఈ టైంలో ఫైబర్ ఫుడ్ అంటే రాగి జావ, మిల్లెట్ డిష్‌లు, లేదా సూప్స్ లాంటివి తీసుకోవాలి. రాత్రి టైంలో షుగర్, కార్బోహైడ్రేట్స్‌ను వీలైనంత వరకూ స్కిప్ చేయడం మంచిది.

ఇలా తినాలి
శరీరంలో అవయవాలు సరిగ్గా పనిచేయాలంటే.. రోజుకి కనీసం 2 నుంచి 3 లీటర్ల నీటిని తాగాలి. రోజుకు 25 నుంచి 30 గ్రాముల ప్రొటీన్‌‌ సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ అయితే సమస్యలొస్తాయి. అలాగే తినేటప్పుడు ఫుడ్‌ను బాగా నమిలి తినాలి. 70శాతం గ్రైండ్ ఇక్కడే జరగాలి. నోటితో ఎంత ఎక్కువ గ్రైండ్ చేస్తే.. కడుపులో అంత ఈజీగా జీర్ణమవుతుంది.

అలాగే రోజూ కనీసం 30 నిమిషాలు వర్కవుట్స్ చేయడం ద్వారా మనం తీసుకునే ఫుడ్ శరీరానికి బాగా వంటపడుతుంది. అలాగే నాన్‌వెజ్ ఎక్కువగా తిన్నప్పుడు కాస్త ఎక్కువ వర్కవుట్ చేయాలి.
ఆహారానికి ఆహారానికి మధ్య కనీసం 4 గంటల సమయం ఇవ్వాలి. రాత్రి పూట కడుపుని లైట్ ఫుడ్ తో లేదా ఖాళీగా ఉంచడం బెటర్ అంటున్నారు డైట్ ఎక్స్‌పర్ట్స్.

First Published:  22 Jan 2021 3:48 AM GMT
Next Story