Telugu Global
Cinema & Entertainment

సలార్ లో విలన్ ఇతడేనా?

ఓ పెద్ద సినిమా ప్రకటన వచ్చిందంటే చాలు, ఆ వెంటనే పుకార్లు బయల్దేరుతాయి. సలార్ సినిమాకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ సినిమాలో కత్రినాకైఫ్ ను హీరోయిన్ గా తీసుకున్నారంటూ మొన్నటివరకు ప్రచారం జరిగింది. ఇప్పుడు విలన్ పై కొత్తగా మరో ప్రచారం మొదలైంది. ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతిని తీసుకున్నారంటూ పుకార్లు మొదలయ్యాయి. మాస్టర్ సినిమాలో విలన్ గా మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు […]

vijay-sethupathi
X

ఓ పెద్ద సినిమా ప్రకటన వచ్చిందంటే చాలు, ఆ వెంటనే పుకార్లు బయల్దేరుతాయి. సలార్ సినిమాకు
కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ సినిమాలో కత్రినాకైఫ్ ను హీరోయిన్ గా తీసుకున్నారంటూ
మొన్నటివరకు ప్రచారం జరిగింది. ఇప్పుడు విలన్ పై కొత్తగా మరో ప్రచారం మొదలైంది.

ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతిని
తీసుకున్నారంటూ పుకార్లు మొదలయ్యాయి. మాస్టర్ సినిమాలో విలన్ గా మరింత గుర్తింపు
తెచ్చుకున్నాడు విజయ్ సేతుపతి. అందుకే అతడ్ని సంప్రదించిందట యూనిట్.

అయితే ఇదే సినిమాకు సంబంధించి గతంలో జాన్ అబ్రహాం పేరు తెరపైకొచ్చింది. పాన్ ఇండియా మూవీ
కాబట్టి.. జాన్ అబ్రహాంను విలన్ గా తీసుకుంటే బాగుంటుందని యూనిట్ భావించిందట. కానీ ఇప్పుడు
ఆశ్చర్యంగా విజయ్ సేతుపతి పేరు తెరపైకొచ్చింది.

ఈమధ్య సలార్ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రచారం జరిగినా వెంటనే దానిపై క్లారిటీ ఇస్తున్నాడు
దర్శకుడు ప్రశాంత్ నీల్. విలన్ ఎవరనే అంశంపై వినిపిస్తున్న ఈ పుకార్లపై కూడా అతడు స్పష్టత
ఇస్తాడేమో చూడాలి.

First Published:  22 Jan 2021 7:49 AM GMT
Next Story