Telugu Global
NEWS

గవర్నర్​తో నిమ్మగడ్డ భేటీ.. మతలబు ఏమిటి?

ఏపీలో పంచాయతీ ఎన్నికల వ్యవహారం కొంతకాలంగా ఓ కొలిక్కి రావడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్​.. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించొద్దని రాష్ట్రప్రభుత్వం పట్టుదలతో ఉన్నాయి. దీంతో సందిగ్ధం నెలకొన్నది. ఇప్పటికే ఇరుపక్షాలు కోర్టుదాకా వెళ్లాయి. అయితే ఎన్నికలు నిర్వహించవచ్చంటూ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం తలుపుతట్టింది. మరోవైపు శుక్రవారం ఆయన ఏపీ గవర్నర్​ బిస్వభూషణ్ హరిచందన్‌ను కలుసుకున్నారు. అయితే ఎన్నికల కమిషనర్​ ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు నొటిఫికేషన్​ […]

గవర్నర్​తో నిమ్మగడ్డ భేటీ.. మతలబు ఏమిటి?
X

ఏపీలో పంచాయతీ ఎన్నికల వ్యవహారం కొంతకాలంగా ఓ కొలిక్కి రావడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్​.. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించొద్దని రాష్ట్రప్రభుత్వం పట్టుదలతో ఉన్నాయి. దీంతో సందిగ్ధం నెలకొన్నది. ఇప్పటికే ఇరుపక్షాలు కోర్టుదాకా వెళ్లాయి. అయితే ఎన్నికలు నిర్వహించవచ్చంటూ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం తలుపుతట్టింది.

మరోవైపు శుక్రవారం ఆయన ఏపీ గవర్నర్​ బిస్వభూషణ్ హరిచందన్‌ను కలుసుకున్నారు. అయితే ఎన్నికల కమిషనర్​ ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు నొటిఫికేషన్​ ఇచ్చారు. కానీ ఉద్యోగసంఘాలు మాత్రం తాము విధుల్లో పాల్గొనలేమంటూ తేల్చిచెప్పాయి.

దీంతో ఎన్నికల సంఘం ఏ విధంగా స్పందిస్తుందో అని ఆసక్తి నెలకొన్నది. ఈ క్రమంలోనే ఎన్నికల కమిషనర్​ నిమ్మగడ్డ.. గవర్నర్​ను కలిసినట్టు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్​ అమల్లో ఉన్నందున ఉద్యోగులు ఇలా చేయడం సరికాదని ఆయన గవర్నర్​కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

అయితే ఈ సందర్భంగా ఎన్నికల షెడ్యూల్​ విడుదల, ప్రభుత్వం స్పందిస్తున్న తీరు తదితర విషయాలను నిమ్మగడ్డ గవర్నర్​కు వివరించినట్టు సమాచారం. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఎన్నికలు ఇప్పుడు పెట్టడానికి సుముఖంగా లేదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్​ తప్పుల తడకగా ఉందని మరోసారి పిటిషన్​ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ రేపే విడుదల కానుంది. దీంతో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసే యోచనలో వైసీపీ ప్రభుత్వం ఉంది.

First Published:  22 Jan 2021 6:02 AM GMT
Next Story