కొత్త డేట్ చెప్పిన నాగ్ అశ్విన్

ప్రభాస్ హీరోగా పాన్-వరల్డ్ సినిమా ఎనౌన్స్ చేశాడు దర్శకుడు నాగ అశ్విన్. వైజయంతీ మూవీస్ బ్యానర్
పై 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఆమధ్య వరుసపెట్టి అప్
డేట్స్ ఇచ్చాడు. ఓసారి దీపిక పదుకోన్ హీరోయిన్ అని, ఇంకోసారి బిగ్ బి ఈ ప్రాజెక్టులో ఉన్నారని, మరో
రోజు సింగీతం శ్రీనివాసరావు వర్క్ చేస్తున్నారని.. ఇలా వరుసపెట్టి అప్ డేట్స్ ఇచ్చాడు.

ఈ క్రమంలో ఈ సంక్రాంతికి కూడా మంచి అప్ డేట్ ఒకటి ఇస్తానని ప్రకటించాడు దర్శకుడు. కానీ
సంక్రాంతి గడిచి 10 రోజులు అవుతున్నప్పటికీ ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతో నాగ అశ్విన్ పై సోషల్
మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోలింగ్ మొదలుపెట్టింది. ఈ జాప్యంపై వివరణ ఇచ్చాడు నాగ అశ్విన్.

ప్రభాస్ సినిమాకు సంబంధించి ఈనెల 29 లేదా ఫిబ్రవరి 26న కచ్చితంగా ఓ అప్ డేట్ ఇస్తానని
ప్రకటించాడు ఈ దర్శకుడు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ఈ సినిమాలో విలన్ ఎవరనే అంశాన్ని నాగ్
అశ్విన్ ప్రకటించే అవకాశం ఉంది.