ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ అదేనా!

RRR Motion Poster

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే ఈ మూవీ రిలీజ్ ఎప్పుడనేది మాత్రం అంతుచిక్కని ప్రశ్నగా మారింది. షూటింగ్ పూర్తయి, రీ-రికార్డింగ్ సగం పూర్తయితే తప్ప రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ రాదని స్వయంగా రాజమౌళి గతంలో ప్రకటించాడు. అయితే ఇప్పుడీ విడుదలకు సంబంధించి చూచాయగా ఓ తేదీ బయటకొచ్చింది.

ఈ ఏడాదిలోనే ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవుతుందట. మరీ ముఖ్యంగా అక్టోబర్ 8న ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో వర్క్ చేస్తున్న ఓ విదేశీ నటి, ఈ విషయాన్ని ఇనస్టాగ్రామ్ లో బయటపెట్టింది. ఆ వెంటనే తప్పు తెలుసుకొని వెంటనే ఆ పోస్టును డిలీట్ చేసింది.

అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆమె పెట్టిన పోస్టు చాలా మందికి చేరిపోయింది. సో.. అన్నీ అనుకున్నట్టు జరిగితే అక్టోబర్ లో ఆర్ఆర్ఆర్ థియేటర్లలోకి వస్తుంది. ఒకవేళ మళ్లీ ఏదైనా అడ్డంకి వచ్చి సినిమా పోస్ట్ పోన్ అయితే.. వచ్చే ఏడాది సంక్రాంతి పక్కా.