Telugu Global
NEWS

నిమ్మగడ్డ నోటిఫికేషన్‌ విడుదల చేసిన తర్వాత ఏం జరుగుతుంది?

ఏపీలో ఎన్నికల సంఘం పంతానికి పోతోంది. దీంతో అక్కడ అధికారులు వర్సెస్‌ అధికారులుగా వ్యవహారం మారిపోతోంది. తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్‌ ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది. ప్రక్రియ ప్రారంభించాలని అధికారులకు సూచిస్తుంది. కానీ ఇదంతా ఇప్పుడు సాధ్యమవుతుందా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఎన్నికల ప్రక్రియ అంటే పెద్ద తంతు. తొలి దశలో నామినేషన్ల నుంచి పోలింగ్ వరకు జరగాలి. అంటే క్షేత్రస్థాయిలో అన్ని సవ్యంగా సాగాలి. తొలి దశ నోటిఫికేషన్‌ ఇవ్వగానే 25 నుంచి నామినేషన్ల […]

నిమ్మగడ్డ నోటిఫికేషన్‌ విడుదల చేసిన తర్వాత ఏం జరుగుతుంది?
X

ఏపీలో ఎన్నికల సంఘం పంతానికి పోతోంది. దీంతో అక్కడ అధికారులు వర్సెస్‌ అధికారులుగా వ్యవహారం మారిపోతోంది. తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్‌ ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది. ప్రక్రియ ప్రారంభించాలని అధికారులకు సూచిస్తుంది. కానీ ఇదంతా ఇప్పుడు సాధ్యమవుతుందా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి.

ఎన్నికల ప్రక్రియ అంటే పెద్ద తంతు. తొలి దశలో నామినేషన్ల నుంచి పోలింగ్ వరకు జరగాలి. అంటే క్షేత్రస్థాయిలో అన్ని సవ్యంగా సాగాలి.

తొలి దశ నోటిఫికేషన్‌ ఇవ్వగానే 25 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుంది. దాదాపు లక్షకు పైగా నామినేషన్‌ పేపర్లు అవసరం ఉంటుంది. వీటిని ప్రింట్‌ చేయాలి. సోమవారం సుప్రీంకోర్టులో తేల్చుకునే వరకు ప్రభుత్వం ఆగాలి అంటోంది. అధికారులు ఎన్నికల సంఘానికి ఇదే మాట తేల్చి చెప్పారు. దీంతో ఇప్పుడు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా.. పేపర్లు, అధికారులు అందుబాటులో లేకపోతే ఎలా ముందుకు వెళుతుంది అనేది ఓ ప్రశ్న.

ఫిబ్రవరి 5న జరిగే ఎన్నికల కోసం అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు, గుర్తులతో కూడిన బ్యాలెట్‌ పేపర్లు ముద్రణ టైమ్‌కు పూర్తి కావాలి. ఇవన్నీ పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు చూసే వ్యవహారం. ఇవన్నీ ఇప్పుడు ఇంత తక్కువ టైమ్‌లో జరుగుతాయా? అనేది మరో ప్రశ్న.

ఇంకా అసలు సమస్య. బ్యాలెట్ బాక్సులు. ఇవన్నీ రెడీ చేశారా? అనేది తెలియలేదు. కరోనాటైమ్‌లో వీటిని శానిటైజ్‌ చేయాలి. ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. కానీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ మాత్రం పంతానికి పోయి.. ఏర్పాట్లు లేకుండా నోటిఫికేషన్‌ ఇవ్వడంతో.. ఇప్పుడు ఈ అంశంలోనే కోర్టులోనే ప్రభుత్వం తేల్చుకోవాలని అనుకుంటోంది. దీంతో నోటిఫికేషన్‌ విడుదలైనా.. ఎన్నికలు జరుగుతాయా? అనేది ఇప్పుడు మరో సమస్య. మొత్తానికి ఏపీలో ఐఏఎస్‌ వర్సెస్‌ ఐఏఎస్‌ వార్‌ మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

First Published:  22 Jan 2021 11:33 PM GMT
Next Story