Telugu Global
NEWS

సమ్మెకు దిగనున్న ఏపీ ఉద్యోగులు?

ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఒకవైపు కరోన వ్యాక్సినేషన్‌కు ఇబ్బందులు ఏర్పడతాయిని ప్రభుత్వం చెబుతున్నా.. పంతానికి పోయిన నిమ్మగడ్డ హడావిడిగా నోటిఫికేషన్ విడుదల చేశారు. మరోవైపు ఈ నెల 25న సుప్రీంకోర్టులో ఎన్నికలపై ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణకు రానుంది. ఇప్పటికే ఎన్నకలకు సహకరించలేమని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. కరోనా కాలంలో ప్రాణాలు ఫణంగా పెట్టి ఎన్నికల విధులు […]

సమ్మెకు దిగనున్న ఏపీ ఉద్యోగులు?
X

ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఒకవైపు కరోన వ్యాక్సినేషన్‌కు ఇబ్బందులు ఏర్పడతాయిని ప్రభుత్వం చెబుతున్నా.. పంతానికి పోయిన నిమ్మగడ్డ హడావిడిగా నోటిఫికేషన్ విడుదల చేశారు. మరోవైపు ఈ నెల 25న సుప్రీంకోర్టులో ఎన్నికలపై ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణకు రానుంది. ఇప్పటికే ఎన్నకలకు సహకరించలేమని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. కరోనా కాలంలో ప్రాణాలు ఫణంగా పెట్టి ఎన్నికల విధులు నిర్వర్తించలేమని వాళ్లు చెబుతున్నారు.

ఎన్నికల సైరన్ మోగిన తర్వాత కూడా ఉగ్యోగుల్లో ఎలాంటి హడావిడి మొదలు కాలేదు. ఎన్నికలకు దూరంగా ఉండాలనే తమ నిర్ణయంపైనే కట్టుబడి ఉన్నట్లు కనిపిస్తున్నది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎన్నికల విధులు చేపట్టబోమని.. అవసరమైతే సమ్మెకు వెళ్తామని ఉద్యోగులు హెచ్చరికలు జారీ చేశారు. నిమ్మగడ్డ రమేష్ వ్యవహార శైలి వల్లే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సక్రమంగా జరగాలంటే ఉద్యోగులే కీలకం. అలాంటిది వాళ్లే విధులను బహిష్కరిస్తామని చెబుతుండటంతో ఇప్పుడు ఎన్నికలు సందిగ్దంలో పడ్డాయి.

ఉద్యోగులు ఎన్నికల నిర్వహణలో పాల్గొనేందుకు ఇబ్బందులు పడుతున్నారని స్వయంగా ముఖ్య కార్యదర్శి లేఖ రాసినా ఎస్ఈసీ రమేష్ కుమార్ పట్టించుకోలేదు. కనీసం ఈ సమస్యపై చర్చించాలని కూడా రమేష్ కుమార్ భావించలేదు. పైగా నోటిఫికేషన్ కూడా విడుదల చేయడంతో ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు గుర్రుగా ఉన్నాయి. సమ్మెకు వెళ్తే ఎన్నికల పరిస్థితేంటనేది ప్రశ్నార్థకంగా మారనున్నది. ఉద్యోగులు సహకరించకుండా ఎన్నికలు నిర్వహించడం అసాధ్యం. మరోవైపు ఉద్యోగులను పిలిచి మాట్లాడకుండా.. నిమ్మగడ్డ హెచ్చరికలు జారీ చేయడం కూడా వారికి మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తున్నది. ఇలాగే కొనసాగితే ఉద్యోగులు సమ్మెకు వెళ్లడం ఖాయంగానే కనిపిస్తున్నది. అదే జరిగితే వ్యాక్సినేషన్‌కు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నది.

First Published:  24 Jan 2021 1:38 AM GMT
Next Story