Telugu Global
NEWS

సాగర్‌ బై పోల్ బరిలో రాములమ్మ !

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ రాలేదు. ఫిబ్రవరి మొదటి వారంలో విడుదలవుతుందని అంచనా వేస్తున్నారు. కానీ అక్కడ రాజకీయం మాత్రం వేడెక్కింది. ఇప్పటికే కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డి సైలెంట్‌గా ప్రచారం మొదలుపెట్టారు. టీఆర్‌ఎస్‌ కూడా అభివృద్ధి పనులు అంటూ ప్రారంభోత్సవాల హడావుడి చేస్తోంది. ఈ నెలాఖరులో సీఎం కేసీఆర్ అక్కడ పర్యటిస్తారని తెలుస్తోంది. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత వచ్చిన ఊపు చల్లబడకుండా చూసుకోవడం బీజేపీకి ఇప్పుడు అనివార్యంగా మారింది. గెలిచే అభ్యర్థి కోసం వెతుకుతోంది. […]

సాగర్‌ బై పోల్ బరిలో రాములమ్మ !
X

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ రాలేదు. ఫిబ్రవరి మొదటి వారంలో విడుదలవుతుందని అంచనా వేస్తున్నారు. కానీ అక్కడ రాజకీయం మాత్రం వేడెక్కింది. ఇప్పటికే కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డి సైలెంట్‌గా ప్రచారం మొదలుపెట్టారు. టీఆర్‌ఎస్‌ కూడా అభివృద్ధి పనులు అంటూ ప్రారంభోత్సవాల హడావుడి చేస్తోంది. ఈ నెలాఖరులో సీఎం కేసీఆర్ అక్కడ పర్యటిస్తారని తెలుస్తోంది.

దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత వచ్చిన ఊపు చల్లబడకుండా చూసుకోవడం బీజేపీకి ఇప్పుడు అనివార్యంగా మారింది. గెలిచే అభ్యర్థి కోసం వెతుకుతోంది. 2018 ఎన్నికల్లో పోటీ చేసిన కంకణాల నివేదిత రెడ్డి ఇప్ప‌టికే ప్రచారం ప్రారంభించారు. ప్రచార రథాలు, భారీ ప్లెక్సీలతో ఎన్నికల ప్రచారం లెవెల్లో దూసుకెళుతున్నారు. గత ఎన్నికల్లో కేవలం 2,675 ఓట్లు సాధించిన ఆమెకు టికెట్‌ హామీ మాత్రం రాలేదు.

సాగర్‌లో కమలం పార్టీకి కేడర్‌ లేదు. ఇప్పటికీ అక్కడ పార్టీ నిర్మాణం బలంగా లేదు. కానీ ఇటీవల పార్టీ సాధించిన వరుస విజయాలతో కొంత ఊపు వస్తుందని నేతల అంచనా. దుబ్బాక, జీహెచ్‌ఎంసీలో కమలం ప్రధాన ప్రత్యర్థి టీఆర్‌ఎస్‌. కానీ సాగర్‌లో మాత్రం కాంగ్రెస్‌ ఇక్కడ ప్రత్యర్ధి కావడం గమనించాల్సిన విషయం.

సాగర్‌ టికెట్‌ కోసం లోకల్‌ నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అయితే సడెన్‌గా ఇటీవల పార్టీలో చేరిన విజయశాంతిని ఇక్కడ నుంచి పోటీ చేయించాలనే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నారని తెలుస్తోంది. నియోజకవర్గంలో కేడర్‌ లేకపోవడంతో కొంత గుర్తింపు ఉన్న నేతను బరిలోకి దించాలని బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది,

2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి 20 వేలకు పైగా ఓట్లు సాధించిన కడారి అంజయ్య యాదవ్‌ కూడా కమలం టికెట్‌ ఆశిస్తున్నారు. ఇటీవలే పార్టీలో చేరిన ఆయన కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ జనంలోకి వెళుతున్నారు. ఈయనే కాదు. ఇటీవల కమలం కండువా కప్పుకున్న రిక్కల ఇంద్రాసేనా రెడ్డి కూడా టికెట్‌ ఆశిస్తున్నారు. మొత్తానికి టీఆర్ఎస్‌, కాంగ్రెస్ రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలను బరిలోకి దింపితే.. బీజేపీ బీసీ సామాజిక వర్గంపైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

First Published:  23 Jan 2021 9:24 PM GMT
Next Story