Telugu Global
National

రైతుల పరేడ్.. ఢిల్లీవైపు భారీగా ట్రాక్టర్లు

కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గత నవంబర్ నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీ అవుటర్ రింగ్ రోడ్డులో భారీగా ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. దీనికి సంబంధించి పలు రాష్ట్రాల నుంచి ట్రాక్టర్లు ఢిల్లి వైపు ప్రయాణం మొదలు పెట్టాయి. మంగళవారం ప్రభుత్వం నిర్వహించే పరేడ్ ముగిసిన తర్వాత రైతుల ట్రాక్టర్ ర్యాలీ మొదలవుతుందని నిర్వాహకులు తెలిపారు. రైతుల […]

రైతుల పరేడ్.. ఢిల్లీవైపు భారీగా ట్రాక్టర్లు
X

కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గత నవంబర్ నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీ అవుటర్ రింగ్ రోడ్డులో భారీగా ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. దీనికి సంబంధించి పలు రాష్ట్రాల నుంచి ట్రాక్టర్లు ఢిల్లి వైపు ప్రయాణం మొదలు పెట్టాయి. మంగళవారం ప్రభుత్వం నిర్వహించే పరేడ్ ముగిసిన తర్వాత రైతుల ట్రాక్టర్ ర్యాలీ మొదలవుతుందని నిర్వాహకులు తెలిపారు.

రైతుల ట్రాక్టర్ ర్యాలీ సాధారణ ర్యాలీలా కాకుండా పరేడ్‌లా నిర్వహించనున్నారు. ఇందులో శకటాలను కూడా ప్రదర్శిస్తారు. వ్యవసాయ చట్టాలు, పల్లె జీవనం, పశువుల పెంపకం వంటి శకటాలు పరేడ్‌లో అలరించనున్నాయి. మహరాష్ట్రలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాల సభ్యులు, పిల్లలు కలసి ఒక శకటాన్ని ప్రదర్శించనున్నట్లు సమాచారం.

దేశ రాజధాని సరిహద్దులోని సింఘు, టిక్రి, ఘాజీపూర్, పల్వాల్, షాహజాన్‌పూర్ సరిహద్దుల నుంచి ట్రాక్టర్ ర్యాలీ ప్రారంభం అవుతుంది. అవుటర్ రింగ్ రోడ్‌లో 100 కిలోమీటర్ల ప్రయాణం అనంతరం సాయంత్రం 6 గంటలకు ర్యాలీ ముగుస్తుందని నిర్వాహకులు తెలిపారు. రైతులే స్వయంగా ప్రతీ సరిహద్దు కేంద్రం వద్ద 40 మందితో వార్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ఇందులో వైద్యులు, మాజీ భద్రతా బలగాల సిబ్బంది, సామాజిక మాధ్యమ నిర్వాహకులు ఉంటారు. ట్రాక్టర్‌పై ఇష్టం వచ్చిన మందిని కూర్చోనివ్వకుండా కేవలం ఐదుగురికే అనుమతి మంజూరు చేశారు.

మరోవైపు రైతుల ర్యాలీకి మద్దతుగా నేడు ముంబయిలో భారీ ఊరేగింపు నిర్వహించనున్నారు. నాసిక్ నుంచి ఇప్పటికే భారీ ఎత్తున రైతులు ముంబయి వైపు బయలుదేరారు. ఈ కార్యక్రమం అనంతరం సీఎం ఉద్దవ్ ఠాక్రేకు వినతిపత్రం సమర్పించనున్నారు.

First Published:  24 Jan 2021 11:04 PM GMT
Next Story