సెట్స్ పైకొచ్చిన పవన్-రానా సినిమా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విలక్షణ నటుడు రానా దగ్గుబాటి కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుంచి మొదలైంది. మొదటి రోజే పవన్ కల్యాణ్ సెట్స్ పైకొచ్చాడు. సాగర్ చంద్ర ఈ సినిమాకు దర్శకుడు.

ఫైట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో పవన్ పై యాక్షన్ సన్నివేశాలు తీస్తున్నారు. రేపట్నుంచి రానా సెట్స్ పైకి రాబోతున్నాడు. ఈ షెడ్యూల్ ను 10 రోజుల పాటు ప్లాన్ చేశారు.

మలయాళంలో సూపర్ హిట్టయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా వస్తోంది ఈ చిత్రం. పవన్ ఇమేజ్, స్టయిల్ కు తగ్గట్టు చిన్న చిన్న మార్పులు చేశారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే తో పాటు డైలాగ్స్ అందిస్తున్నాడు.

సముద్ర ఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.