హీరోలపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

ఎఫ్-2 సినిమాలో ఇద్దరు హీరోలుున్నారు. కాబట్టి దానికి సీక్వెల్ గా వస్తున్న ఎఫ్3లో ముగ్గురు హీరోలు
ఉంటారనే ప్రచారం చాన్నాళ్లుగా నడుస్తోంది. టైటిల్ లో 3 ఉంది కాబట్టి, హీరోలు ముగ్గురు అనేది
చాలామంది లాజిక్. అయితే ఈ ప్రచారాన్ని దర్శకుడు అనీల్ రావిపూడి ఖండిస్తున్నాడు. ఎఫ్3లో కూడా
హీరోలు ఇద్దరే అంటున్నాడు ఈ డైరక్టర్.

ఈ సినిమాలో మూడో హీరోగా మహేష్ బాబు లేదా రవితేజ నటించే అవకాశం ఉందంటూ ప్రచారం
జరిగింది. ఆ తర్వాత గోపీచంద్ పేరు కూడా తెరపైకొచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులకు సాయిధరమ్ తేజ్
పేరు కూడా వినిపించింది. అయితే అలాంటిదేం లేదని ప్రకటించాడు అనీల్ రావిపూడి. ఎఫ్-3లో
వరుణఅ తేజ్, వెంకటేష్ మాత్రమే కనిపిస్తారని చెబుతున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మెహ్రీన్, తమన్న హీరోయిన్లుగా నటిస్తున్న ఈ
సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్
వీడియోస్ సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే.