సుధ లాడ్జ్ లోకి వెళ్లిన పవన్ కల్యాణ్

హీరో పవన్ కల్యాణ్ మరో సినిమా స్టార్ట్ చేశాడు. సాగర్ చంద్ర దర్శకత్వంలో నిన్నట్నుంచి ఆయన
అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడా మూవీకి సంబంధించి
మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. రిపబ్లిక్ డే కానుకగా ఈ వీడియో రిలీజైంది.

ఫస్ట్ షెడ్యూల్ లో పవన్ పై యాక్షన్ ఎపిసోడ్స్ తీస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసం ఓ లాడ్జ్ సెట్
వేశారు. దీనికి సుధా లాడ్జ్ అనే పేరు పెట్టారు. ఈ లాడ్జ్ బయట పవన్-విలన్లపై దిలీప్ సుబ్బరాయన్
నేతృత్వంలో ఫైట్ తీస్తున్నారు. ఈ లాడ్జ్ లోకి బైక్ పై స్టయిలిష్ గా పవన్ ఎంటరయ్యే సీన్ ను వీడియోలో
చూపించారు.

పేరుకు ఈ సినిమా సాగర్ చంద్ర దర్శకత్వంలో వస్తున్నప్పటికీ, అన్నీ త్రివిక్రమ్ దగ్గరుండి
చూసుకుంటున్నాడు. ఆ ఒప్పందంతోనే పవన్ ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడట. ఈ సినిమాకు
త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించడంతో పాటు.. డైలాగ్స్ కూడా రాస్తున్నాడు. వీటితో పాటు అనధికారికంగా
దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి,
ఐశ్వర్యరాజేష్ హీరోయిన్లుగా నటించబోతున్నారు. ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.