Telugu Global
National

రైతన్నలపై విరిగిన లాఠీలు.. అట్టుడుకుతున్న రాజధాని..!

గత కొంతకాలంగా కేంద్రప్రభుత్వ రైతు చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతు సంఘాలు ఇవాళ (జనవరి26) దేశ రాజధానిలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే పోలీసులు ముందుగా ఈ ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత షరతులతో అనుమతి ఇచ్చారు. దీంతో రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోనుంచి ట్రాక్టర్లతో ఢిల్లీలోకి వెళ్లారు. అయితే అనుహ్యంగా భారీగా రైతులు తమ కుటుంబసభ్యులతో కలిసి ఢిల్లీ వీధుల్లోకి అడుగుపెట్టారు. పోలీసుల బారికేడ్లను ఛేదించి ముందుకు దూసుకెళ్లారు. అయితే రైతులపై పోలీసులు లాఠీ […]

రైతన్నలపై విరిగిన లాఠీలు.. అట్టుడుకుతున్న రాజధాని..!
X

గత కొంతకాలంగా కేంద్రప్రభుత్వ రైతు చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతు సంఘాలు ఇవాళ (జనవరి26) దేశ రాజధానిలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే పోలీసులు ముందుగా ఈ ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత షరతులతో అనుమతి ఇచ్చారు. దీంతో రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోనుంచి ట్రాక్టర్లతో ఢిల్లీలోకి వెళ్లారు. అయితే అనుహ్యంగా భారీగా రైతులు తమ కుటుంబసభ్యులతో కలిసి ఢిల్లీ వీధుల్లోకి అడుగుపెట్టారు. పోలీసుల బారికేడ్లను ఛేదించి ముందుకు దూసుకెళ్లారు. అయితే రైతులపై పోలీసులు లాఠీ చార్జ్​ చేశారు. భాష్పవాయుగోళాలు ప్రయోగించారు.

అయినప్పటికీ అన్నదాతలు వెనక్కి తగ్గలేదు. తమ గళాన్ని, ఆందోళనను ప్రపంచానికి తెలిసేలా చేశారు. చివరకు ఢిల్లీలోని ఎర్రకోటపై జెండా ఎగరవేసి తమ నిరసనను తెలిపారు.పోలీసులు మాత్రం రైతులపై చాలా అమానుషంగా ప్రవర్తించారు. పలుచోట్ల రైతులు ట్రాక్టర్లలో ఉన్నా.. వాళ్లపై లాఠీచార్జ్​చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్​మీడియాలో వైరల్​ అవుతున్నాయి.

మరోవైపు ఇప్పటికే పలువురు ప్రజాస్వామిక వాదులు రైతు ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. రైతులు ట్రాక్టర్​ ర్యాలీ నిర్వహించడంపై పోలీసులకు ముందే సమాచారం ఉండటంతో రైతుల ట్రాక్టర్​ ర్యాలీని ఎలాగైనా అడ్డుకోవాలని చూశారు. ఢిల్లీలో జరిగే ఆందోళనలో పాకిస్థాన్​కు చెందిన ఆందోళనకారులు చొరబడతారని పోలీసులు అనుమానించారు.

ఏది ఏమైనప్పటికీ రైతు సంఘాలు మాత్రం తమ నిరసన గళాన్ని వినిపించాయి. బారికేడ్లను దాటుకోని.. భాష్పవాయుగోళాలను ఎదుర్కొని కదనరంగంలోకి దూకాయి. తమ డిమాండ్​ను ప్రపంచానికి తెలిసేలా చేశాయి. అయితే రైతుల ఆందోళన మాత్రం తీవ్ర ఉద్రిక్తంగా మారి పలు పోలీస్​ వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు ఉక్కుపాదంతో రైతు ఉద్యమాన్ని ఆపాలని చూసినప్పటికీ.. అన్నదాతలు మాత్రం ఎర్రకోటపైకి వెళ్లి తమ జెండాను ఎగరవేశారు.

First Published:  26 Jan 2021 8:42 AM GMT
Next Story