Telugu Global
Cinema & Entertainment

మరో సినిమా స్టార్ట్ చేసిన యంగ్ హీరో

వైవిధ్యమైన కథా చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న యంగ్‌ హీరో సందీప్‌కిషన్‌. ఇప్పుడీ హీరో మరో సినిమా స్టార్ట్ చేశాడు. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై వేద వ్యాస్‌ దర్శకత్వంలో మహేశ్‌ కోనేరు నిర్మాతగా ఈ కొత్త సినిమా వైజాగ్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రైటర్‌ కోన వెంకట్‌ క్లాప్‌కొట్టగా, కంకట్ల సిల్క్స్‌ మల్లిక్‌ కెమెరా స్విచ్ ఆన్‌ చేశారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సంక్రాంతి కానుకగా […]

మరో సినిమా స్టార్ట్ చేసిన యంగ్ హీరో
X

వైవిధ్యమైన కథా చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న యంగ్‌ హీరో
సందీప్‌కిషన్‌. ఇప్పుడీ హీరో మరో సినిమా స్టార్ట్ చేశాడు. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై వేద వ్యాస్‌
దర్శకత్వంలో మహేశ్‌ కోనేరు నిర్మాతగా ఈ కొత్త సినిమా వైజాగ్‌లో లాంఛనంగా ప్రారంభమైంది.
ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రైటర్‌ కోన వెంకట్‌ క్లాప్‌కొట్టగా, కంకట్ల సిల్క్స్‌ మల్లిక్‌ కెమెరా స్విచ్ ఆన్‌
చేశారు.

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సంక్రాంతి కానుకగా మాస్టర్ సినిమా వచ్చింది. సినిమాకు నెగెటివ్ టాక్
వచ్చినప్పటికీ నిర్మాత సేఫ్. ఆ ఉత్సాహంతో ఇప్పుడీ కొత్త సినిమా స్టార్ట్ చేశాడు మహేష్ కోనేరు.

ఈ సినిమాలో సందీప్ కిషన్ పాత్ర చాలా కొత్త‌గా ఉండబోతోంది. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌
ప్రారంభం అవుతుంది. వేద వ్యాస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రానికి ఛోటా కె.ప్ర‌సాద్
ఎడిటర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నారు.

First Published:  26 Jan 2021 7:47 AM GMT
Next Story