Telugu Global
Cinema & Entertainment

ఏ1 ఎక్స్ ప్రెస్ ట్రయిలర్ రివ్యూ

టాలెంటెడ్ హీరో సందీప్ కిష‌న్ న‌టిస్తోన్న 25వ చిత్రం `ఏ1 ఎక్స్‌ప్రెస్`. టాలీవుడ్‌లో రూపొందుతోన్న తొలి హాకీ ఫిల్మ్‌ ఇది. న్యూ-ఏజ్ స్పోర్ట్స్ ఎంట‌ర్‌టైన‌ర్ హీరో సందీప్ కిష‌న్‌కి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ మూవీలో లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌ర్‌, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషెక్ అగ‌ర్వాల్‌, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం నిర్మిస్తున్నారు. `ఏ1 ఎక్స్‌ప్రెస్` ట్రైల‌ర్‌ […]

ఏ1 ఎక్స్ ప్రెస్ ట్రయిలర్ రివ్యూ
X

టాలెంటెడ్ హీరో సందీప్ కిష‌న్ న‌టిస్తోన్న 25వ చిత్రం 'ఏ1 ఎక్స్‌ప్రెస్'. టాలీవుడ్‌లో రూపొందుతోన్న
తొలి హాకీ ఫిల్మ్‌ ఇది. న్యూ-ఏజ్ స్పోర్ట్స్ ఎంట‌ర్‌టైన‌ర్ హీరో సందీప్ కిష‌న్‌కి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.
డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ మూవీలో లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా
న‌టిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌ర్‌, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టి.జి.
విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషెక్ అగ‌ర్వాల్‌, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం నిర్మిస్తున్నారు.

'ఏ1 ఎక్స్‌ప్రెస్' ట్రైల‌ర్‌ తాజాగా రిలీజైంది. ఈ ట్రైల‌ర్‌లో.. భారతదేశం తరఫున ఆడాలని కలలు కనే
యువ‌ హాకీ ఆటగాడిగా సందీప్ కిషన్ క‌నిపిస్తున్నాడు. అత‌డి ప్రేమికురాలిగా లావణ్య త్రిపాఠి కూడా హాకీ
ప్లేయ‌ర్ కావ‌డం విశేషం. ఆన్ స్క్రీన్ మీద ఈ జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది.

ట్రైలర్‌లో త‌న హాకీ స్కిల్స్‌తో సందీప్ కిష‌న్ అంద‌ర్నీ ఎట్రాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం బ‌రువు త‌గ్గి
సిక్స్ ప్యాక్ బాడీని సాధించాడు ఈ హీరో. ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్‌తో ఉన్న ఈ ట్రైల‌ర్ అంద‌రినీ
ఆక‌ట్టుకుంటుంది.

హిప్ హాప్ తమిళ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైల‌ర్‌కి మంచి ఎలివేష‌న్ ఇచ్చింది. కెవిన్ రాజ్ విజువ‌ల్స్ ఫ్రెష్‌గా
ఉండ‌డంతో పాటు ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 26న విడుద‌ల‌చేస్తున్న‌ట్లు
తెలిపారు మేక‌ర్స్‌.

First Published:  27 Jan 2021 5:41 AM GMT
Next Story