ఆచార్య టీజర్ వచ్చేస్తోంది

చిరంజీవి-కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. లాక్ డౌన్ తో ఆలస్యమైన ఈ సినిమా
షూటింగ్ ప్రస్తుతం పరుగులుపెడుతోంది. ఇదే ఊపులో మూవీ ప్రమోషన్ కూడా స్టార్ట్ చేయాలని
నిర్ణయించారు మేకర్స్. ఇందులో భాగంగా ఈనెల 29న ఆచార్య టీజర్ ను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఎల్లుండి సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ఈ టీజర్ రాబోతోంది.

ఈ టీజర్ ఎనౌన్స్ మెంట్ ను ఫన్నీగా ప్లాన్ చేసింది యూనిట్. చిరు-కొరటాల మధ్య ఓ ఫన్నీ సంభాషణ
జరిగేలా మీమ్స్ తయారుచేశారు. “టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తావ్ కొరటాల.. టీజర్ నువ్వు రిలీజ్ చేస్తావా,
లేదా నన్ను లీక్ చేయమంటావా” అని చిరంజీవి అడుగుతాడు. దానికి కొరటాల “టీజర్ రిలీజ్ డేట్
ప్రకటిస్తాను సర్” అంటాడు. ఇలా సరదాగా ప్రమోట్ చేసి మరీ టీజర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు.

కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నాడు. అతడి
పాత్ర పేరు సిద్ధ. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి
నిర్మిస్తున్నారు.