గని రిలీజ్ డేట్ ఫిక్స్

కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు హీరో వరుణ్ తేజ్. అది కూడా ఓ కొత్త దర్శకుడితో కలిసి ఈ ప్రయోగానికి దిగాడు. దీనికి గని అనే టైటిల్ పెట్టారు. ఇప్పుడీ మూవీకి సంబంధించి రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని జూలై 30న ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌ల చేస్తున్న‌ారు.

మెగాప్రిన్స్‌ వ‌రుణ్ తేజ్ హీరోగా ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన చంద్ర త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. వ‌రుణ్‌తేజ్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి డిఫ‌రెంట్ లుక్‌తో బాక్సర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి జార్జ్ సి.విలియ‌మ్స్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.