సమ్మర్ లో కబడ్డీ పెట్టిన గోపీచంద్

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘సీటీమార్‌’. ఈ సినిమాలో ఆంధ్ర ఫీమేల్ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ ఫీమేల్ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా మిల్కీ బ్యూటీ ‌త‌మ‌న్నా న‌టిస్తున్నారు.

గోపిచంద్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. మెలొడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తుండ‌గా భూమిక కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది.

ఇప్ప‌టికే ఈ సినిమా నుండి విడుద‌ల‌చేసిన ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, జ్వాలా రెడ్డిగా త‌మ‌న్నాలుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్‌2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టిస్తూ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. చేతిలో పెద్ద సుత్తి ప‌ట్టుకుని టైర్ల‌మీద కూర్చుని ఉన్నగోపిచంద్ మాస్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

ప్ర‌స్తుతం టాకీ పార్ట్ పూర్త‌య్యింది. రెండు సాంగ్స్ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉన్నాయి. ఫిబ్రవరిలో ఆ 2 సాంగ్స్ షూటింగ్ కంప్లీట్ చేస్తారు.