Telugu Global
NEWS

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా చూడండి..! గవర్నర్​ను కలిసిన జనసేన, బీజేపీ

ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ, జనసేన నేతలు గవర్నర్​ బిశ్వభూషణ్​ హరిచందన్​ను కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలు గవర్నర్​ దృష్టికి తీసుకెళ్లినట్టు వారు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన నేత నాదెండ్ల మనోహర్​ గవర్నర్​ను కలిసి పలు విషయాలు చర్చించారు. ఆ తర్వాత వాళ్లు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించేలా చూడాలని గవర్నర్​ను కోరినట్టు వాళ్లు తెలిపారు. అంతేకాక గతంలో ఏపీలో జరిగిన పంచాయతీ, స్థానికసంస్థల […]

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా చూడండి..! గవర్నర్​ను కలిసిన జనసేన, బీజేపీ
X

ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ, జనసేన నేతలు గవర్నర్​ బిశ్వభూషణ్​ హరిచందన్​ను కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలు గవర్నర్​ దృష్టికి తీసుకెళ్లినట్టు వారు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన నేత నాదెండ్ల మనోహర్​ గవర్నర్​ను కలిసి పలు విషయాలు చర్చించారు.

ఆ తర్వాత వాళ్లు మీడియాతో మాట్లాడుతూ..
రాష్ట్రంలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించేలా చూడాలని గవర్నర్​ను కోరినట్టు వాళ్లు తెలిపారు. అంతేకాక గతంలో ఏపీలో జరిగిన పంచాయతీ, స్థానికసంస్థల ఎన్నికల్లో అనేక అక్రమాలు జరిగాయని వాళ్లు గవర్నర్​ దృష్టికి తీసుకెళ్లారు. ఏకగ్రీవాల పేరుతో అధికార వైసీపీ ప్రలోభాలకు తెరతీసిందని.. ఇతర పార్టీల నేతలు పోటీచేయకుండా బెదిరించిందని గవర్నర్​కు వివరించినట్టు తెలిపారు.

అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఎన్నికల సంఘానికి సహకరించేలా ఆదేశించాలని కూడా గవర్నర్​ను కోరినట్టు తెలిపారు. గతంలో నామినేషన్‌లు కూడా వేయకుండా వైపీపీ అడ్డుకున్నదని వాళ్లు ఆరోపించారు. ఏకగ్రీవాలు సహజంగా జరిగితే మంచిదే కానీ.. ప్రలోభాలకు, బెదిరింపులకు పాల్పడి ఏకగ్రీవాలు చేయడం సరికాదని వాళ్లు పేర్కొన్నారు.

వలంటీర్ల ద్వారా వైసీపీ అక్రమాలకు తెరలేపిందని వాళ్లు ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మత విద్వేషాలు రెచ్చగొడుతున్నదని.. ఫాస్టర్ లకు వేతనాలు ఇవ్వడం వంటి చర్యలకు పాల్పడుతుందని వాళ్లు ఆరోపించారు.

First Published:  28 Jan 2021 5:42 AM GMT
Next Story