‘ఆలయాలపై దాడులను అరికడతాం’ టీడీపీ మ్యానిఫెస్టోలో ఇదే కీలకం..!

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్​ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పంచాయతీ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. అయితే ‘ఆలయాలపై దాడులను అరికడతాం’ అనే అంశాన్ని మ్యానిఫెస్టోలో ప్రధానంగా పొందుపరిచారు. గురువారం టీడీపీ అధినేత చంద్రబాబు మ్యానిఫెస్టోను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పల్లె ప్రగతి – పంచ సూత్రాల పేరుతో, ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో మేనిఫెస్టో విడుదల చేసినట్లు చెప్పారు’ నిజానికి పంచాయతీ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరుగుతాయి. అయితే ఆయా పార్టీల మద్దతుదారులు బరిలో నిలుస్తారు.

కాగా టీడీపీ రాజకీయ ఎత్తుగడలో భాగంగానే ఆలయాల భద్రత అనే అంశాన్ని మ్యానిఫెస్టోలో పొందుపరచడం గమనార్హం. మరోవైపు అధికారంలో లేని టీడీపీ మ్యానిఫెస్టోలో చెప్పిన అంశాలు ఎలా నెరవేరుస్తుంది.. అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

టీడీపీ మ్యానిఫెస్టోలో ఉన్న పంచసూత్రాలు ఇవే..

1 ) ఉచిత మంచి నీటీ కొళాయి.. రక్షిత మంచినీటి పథకం..

2) భద్రత – ప్రశాంతతకు భరోసా కల్పించడం

3) ఆలయాలపై దాడులు అరికడతాం..

4) వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడాన్ని అడ్డుకుంటాం

5) ఆస్తి పన్ను తగ్గిస్తాం. స్వచ్ఛత పరిశుభ్రత పాటిస్తూ ఆదర్శ గ్రామాలు తీర్చిదిద్దుతాం.