Telugu Global
Others

ఇంటి బడ్జెట్ ప్లాన్ చేద్దామా?

ఇప్పుడంతా బడ్జెట్ గురించే టాపిక్. సెంట్రల్ బడ్జెట్ మాటేమో గానీ మన ఇంటి బడ్జెట్ ఎలా ఉండాలో ఎప్పుడైనా ఆలోచించారా? కుటుంబంలో కూడా వచ్చిన ఆదాయాన్ని బట్టి లెక్కల పద్దు రాసుకోవడం చాలా ముఖ్యం. దీన్ని ఎలా ప్లాన్ చేయాలంటే.. వచ్చిన ఆదాయాన్ని ప్రస్తుత అవసరాలకు, ఫ్యూచర్ ఖర్చులకూ, సేవింగ్స్ కు ఇలా రకరకాల ప్రయోజనాలకు ఉపయోగపడేలా లెక్కేసుకోవడమే బడ్జెట్. అది ఇల్లు అయినా దేశం అయినా ఇలానే లెక్కించాలి. సరే మన ఇంటి బడ్జెట్ విషయానికొస్తే.. లాంగ్ […]

ఇంటి బడ్జెట్ ప్లాన్ చేద్దామా?
X

ఇప్పుడంతా బడ్జెట్ గురించే టాపిక్. సెంట్రల్ బడ్జెట్ మాటేమో గానీ మన ఇంటి బడ్జెట్ ఎలా ఉండాలో ఎప్పుడైనా ఆలోచించారా? కుటుంబంలో కూడా వచ్చిన ఆదాయాన్ని బట్టి లెక్కల పద్దు రాసుకోవడం చాలా ముఖ్యం. దీన్ని ఎలా ప్లాన్ చేయాలంటే..

వచ్చిన ఆదాయాన్ని ప్రస్తుత అవసరాలకు, ఫ్యూచర్ ఖర్చులకూ, సేవింగ్స్ కు ఇలా రకరకాల ప్రయోజనాలకు ఉపయోగపడేలా లెక్కేసుకోవడమే బడ్జెట్. అది ఇల్లు అయినా దేశం అయినా ఇలానే లెక్కించాలి. సరే మన ఇంటి బడ్జెట్ విషయానికొస్తే..

లాంగ్ టర్మ్ ప్లాన్స్
బడ్జెట్ వేసేటప్పుడు అది దీర్ఘకాలంలో ఉపయోగపడేలా ప్లాన్ చేయాలి. సొంతిల్లు కట్టుకోవడం, పిల్లల చదువులు, ఇతర ఖర్చులు.. ఇలా పెద్ద పెద్ద ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఐదు, పదేళ్లకు ఎలా మ్యానేజ్ చేయాలో అంచనా వేసుకుని దానికి తగ్గట్టు ఫైనాన్షియల్ ప్లాన్ వేసుకోవాలి. లాంగ్ టర్మ్ ప్లాన్స్ తో పాటే.. ప్రస్తుత అవసరాలు, కొంతకాలం తర్వాత అవసరాలు, భవిష్యత్ తో అవసరాలు.. ఇలా మూడు భాగాలుగా డివైడ్ చేసుకుని బడ్జెట్ ప్లాన్ చేయాలి.

ఇది ముఖ్యం
చాలామంది వచ్చిన మొత్తంలో ఖర్చులు పోనూ మిగతాది సేవింగ్స్ చేస్తుంటారు. కానీ అసలు మన లక్ష్యం ఏంటి అనేది ముందుగానే ప్లాన్ చేసుకుని.. ఆ లక్ష్యాన్ని ఎంత కాలంలో అందుకోవాలి. దానికోసం ఎంత పోగు చేయాలి. డిసైడ్ అయిన తర్వాత సేవింగ్స్ స్టార్ట్ చేయాలి. మన లక్ష్యం వాస్తవంలోకి రావడానికి ఎంత దాయాలి అనేది చూసుకోవాలి. ఎక్కువ అవసరం అవుతుంటే ఆదాయాన్ని పెంచుకునే ఆలోచనలు చేయాలి.

ఎమర్జెన్సీ ఫండ్
ప్రతి ఒక్కరి బడ్జెట్ లో ఎమర్జెన్సీ ఫండ్ అనేది కచ్చితంగా ఉండాలి. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో చెప్పలేం. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గరా కొంత అత్యవసర నిధి ఉండాలి. కనీసం మూడు నెలల ఖర్చులకు సరిపడా మొత్తం ఈ నిధిలో ఉండాలి. కరోనా, లాక్ డౌన్ లాంటి పరిస్థితులను గట్టేక్కాలంటే ఇవే ముఖ్యం.

చెక్ చేసుకుంటూ..
బడ్జెట్ ను వేసుకోవడమే కాదు. దాన్ని పక్కాగా అమలు చేయాలి. బడ్జెట్‌ ప్రకారం వెళ్తున్నామా? లేదా? అని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. మొదటి నెలలోనే ఏదైనా తేడా ఉంటే.. ప్లాన్ మార్చేయాలి. అమలు చేసే విధంగా బడ్జెట్ రూపొందించుకోవాలి. దాన్ని స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి.

అప్పులొద్దు
సాధారణంగా.. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటే.. అప్పులు చేయాల్సొస్తుంది. అప్పులు అనేవి మొదలైతే.. ఫైనాన్షియల్ ప్లాన్ అంతా పాడవుతుంది. అందుకే అప్పుల వరకూ వెళ్లకపోవడమే మంచిది. ఆదాయానికి తగ్గట్టుగా సర్దుబాట్లు ఉండాలి. ఏవైనా అత్యవసర అవసరాలుంటేనే లోన్స్ వరకూ వెళ్లాలి.

ఈ లాజిక్ ముఖ్యం
ప్రతిసారి ఖర్చు చేసే ముందు అది నిజంగా అవసరమా? లేదా అది మన కోరికా అనేది గుర్తించాలి. అవసరాల కోసం ఖర్చు చేయాలే తప్ప కోరికల కోసం కాదు. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. కోరికల కోసం చేసే ఖర్చు.. అవసరాల కోసం చేసే ఖర్చు కంటే ఎక్కువ ఉండకూడదు.

First Published:  1 Feb 2021 4:19 AM GMT
Next Story