Telugu Global
National

చరిత్ర సృష్టించిన నిర్మల సీతారామన్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ సమర్పించే వేళ చరిత్ర సృష్టించారు. ఒక పేపర్ కూడా లేకుండా పూర్తిగా డిజిటల్ విధానంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా ఆమె రికార్డు నెలకొల్పారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 నవంబర్ 26న తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి గత ఏడాది వరకు బడ్జెట్ పత్రాలను ప్రింటింగ్ చేసి ఉభయ పార్లమెంట్ సభ్యులకు అందించే వాళ్లు. కానీ ఈ ఏడాది ఒక్క కాగితం కూడా ప్రింట్ […]

చరిత్ర సృష్టించిన నిర్మల సీతారామన్
X

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ సమర్పించే వేళ చరిత్ర సృష్టించారు. ఒక పేపర్ కూడా లేకుండా పూర్తిగా డిజిటల్ విధానంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా ఆమె రికార్డు నెలకొల్పారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 నవంబర్ 26న తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి గత ఏడాది వరకు బడ్జెట్ పత్రాలను ప్రింటింగ్ చేసి ఉభయ పార్లమెంట్ సభ్యులకు అందించే వాళ్లు. కానీ ఈ ఏడాది ఒక్క కాగితం కూడా ప్రింట్ చేయలేదు. సభ్యులందరికీ కేవలం డిజిటల్ ఫార్మాట్‌లో సాఫ్ట్ కాపీలను అందించారు. క‌రోనా కారణంగానే బడ్జెట్ పేపర్లు ప్రింట్ చేయలేదని తెలుస్తున్నది.

ప్రతీ ఏడాది బడ్జెట్ ప్ర‌వేశ‌పెట్టడానికి రెండు వారాల ముందు పత్రాలను ప్రింటింగ్‌కు ఇస్తారు. అప్పుడే హల్వా కార్యక్రమం నిర్వహిస్తారు. అయితే ఈ సారి సంప్ర‌దాయంగా వస్తున్న హల్వా కార్యక్రమాన్ని నిర్వహించారు. కానీ ఒక్క పత్రాన్ని కూడా ప్రింట్ చేయలేదు. సభ్యులందరికీ సాఫ్ట్ కాపీలు ఇచ్చి.. ఆయా శాఖల బడ్జెట్‌ను వెబ్ సైట్‌లో అప్‌లోడ్ చేశారు.

ఇక సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండటానికి ప్రత్యేక బడ్జెట్ యాప్ కూడా సిద్దం చేశారు. బడ్జెట్ వివరాలన్నీ ఆ యాప్‌లో కూడా వీక్షించే అవకాశం ఉన్నది. ప్రతీ ఏడాది లెదర్ సూట్ కేసుల్లో బడ్జెట్ తీసుకొని వచ్చే సంప్ర‌దాయానికి చెక్ పెడుతూ నిర్మల సీతారామన్ గత రెండేళ్లుగా బాహీ ఖాటాలో పత్రాలను తీసుకొని వచ్చారు. కానీ ఈ సారి ఒక ట్యాప్ పట్టుకొని రావడం విశేషం.

First Published:  1 Feb 2021 3:56 AM GMT
Next Story