Telugu Global
International

గ్రెటాపై ఇండియన్ సెలబ్రెటీల గెలుపు?

గ్రెటా థెన్ బర్గ్. 18 ఏళ్ల పర్యావరణ కార్యకర్త. పిన్నవయసులోనే పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో అడుగుపెట్టింది. పలు అంతర్జాతీయ వేదికలపై గళంవిప్పి ఎందరి మన్ననలో పొందింది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపునొందిన గ్రెటా ప్రస్తుతం నోబెల్ రేసులో ఉంది. తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారతీయ రైతులు చేస్తున్న పోరాటానికి ఆమె మద్దతు ప్రకటించారు. భారత రైతులకు సంఘీభావంగా నిలబడుతాం అంటూ ట్వీట్ చేశారు. ఫార్మర్ ప్రొటెస్ట్ హ్యాష్ […]

గ్రెటాపై ఇండియన్ సెలబ్రెటీల గెలుపు?
X

గ్రెటా థెన్ బర్గ్. 18 ఏళ్ల పర్యావరణ కార్యకర్త. పిన్నవయసులోనే పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో అడుగుపెట్టింది. పలు అంతర్జాతీయ వేదికలపై గళంవిప్పి ఎందరి మన్ననలో పొందింది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపునొందిన గ్రెటా ప్రస్తుతం నోబెల్ రేసులో ఉంది. తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారతీయ రైతులు చేస్తున్న పోరాటానికి ఆమె మద్దతు ప్రకటించారు. భారత రైతులకు సంఘీభావంగా నిలబడుతాం అంటూ ట్వీట్ చేశారు. ఫార్మర్ ప్రొటెస్ట్ హ్యాష్ ట్యాగ్ తో చేసిన ఆ ట్వీట్ ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది దృష్టిని ఆకర్షించింది.

దాదాపు రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతులు చేస్తున్న ఆందోళన ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తారాస్థాయికి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా పలువురు సెలబ్రెటీలు భారత ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. దీంతో కేంద్రం తనను తాను సమర్థించుకునే పనిలో పడింది. అంతర్జాతీయ సెలబ్రెటీలకు కౌంటర్ ఇచ్చేందుకు బాలీవుడ్ తారలు, ఇండియన్ క్రీడాకారులను రంగంలోకి దింపింది. ఇండియా అగనెస్ట్ ప్రాపగండా అనే హ్యాష్ ట్యాగ్ తో ప్రతిదాడికి శ్రీకారం చుట్టింది.

కేంద్రం చూపిన దారిలో భారత సెలబ్రెటీలు పాప్ సింగర్ రిహాన్నా, గ్రెటా తదితరులపై దాడి మొదలుపెట్టారు. ప్రభుత్వానికి, రైతులకు మధ్య విభేదాలు సృష్టించేందుకు అంతర్జాతీయ కుట్ర జరుగుతోందని, ఆ కుట్రలో గ్రెటా తదితరులు భాగమని ఆరోపించారు. వాస్తవాలు తెలీకుండా రైతులకు మద్దతు ప్రకటించడం సరైంది కాదని, భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీయుల జోక్యం తగదంటూ సోషల్ మీడియాలో క్యాంపెయిన్ మొదలుపెట్టారు.

“మీకు సాయం కావాలంటే, ఇవిగో ఆయుధాలు” అంటూ ఓ గూగుల్ డాక్యుమెంట్ ను గ్రెటా షేర్ చేసింది. ఆ డాక్యుమెంట్ రైతు ఉద్యమానికి సంబంధించిన వివరాలు పొందుపరిచి ఉన్నాయి. గ్రెటా ట్వీట్ వైరల్ కావడంతో లక్షలాది మంది భారత ట్విట్టర్ వినియోగదారులు ఆమెపై విరుచుకుపడ్డారు. ఆమె డాక్యుమెంట్ ని షేర్ చేసిన నిమిషాల్లోనే గ్రెటా థెన్ బర్గ్ ఎక్స్పోజ్డ్’ అంటూ ఆమెపై దాడి మొదలైంది. ఒక్కరోజులో దాదాపు 2 లక్షల మంది ట్విట్టర్ వినియోగదారులు ఆమెను విమర్శిస్తూ పోస్టులు పెట్టారు.

రైతులకు సంఘీభావం ప్రకటించడాన్ని నేరంగా పరిగణిస్తూ భారతీయులు చేసిన దాడికి గ్రెటా వెనక్కి తగ్గక తప్పలేదు. రైతులకు సంఘీభావంగా తాను చేసిన ట్వీట్ ను గ్రెటా డిలీట్ చేసింది. అనూహ్యమైన వ్యతిరేకతతో గ్రెటా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. కాగా.. దేశానికి వెన్నుముకగా కీర్తించే రైతులకు అండగా నిలబడలేని వారంతా స్వాభిమానం పేరుతో నిజాల్ని మాట్లాడేవారిపై దాడికి దిగుతున్నారని పలువురు బాలీవుడ్ సెలబ్రెటీలను విమర్శిస్తున్నారు.

First Published:  4 Feb 2021 12:26 AM GMT
Next Story