Telugu Global
NEWS

ఇంకో పదేళ్లు.. నేనే సీఎం.. కార్యవర్గ సమావేశంలో సీఎం కేసీఆర్​ స్పష్టీకరణ..!

‘సీఎం మార్పు’ అంశంపై కేసీఆర్​ క్లారిటీ ఇచ్చేశారు. ఊహాగానాలకు తెరదించారు. మరో పదేళ్లపాటు తానే సీఎంగా ఉంటానని ప్రకటించేశారు. ఇవాళ హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో టీఆర్​ఎస్​ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ పార్టీ కార్యవర్గ సభ్యులతో సమావేశమయ్యారు. త్వరలో తెలంగాణకు కేటీఆర్​ సీఎం కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. పలువురు మంత్రులు కూడా ఈ విషయంపై నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. దీంతో ఇవాళ జరిగిన మీటింగ్​కు ప్రాధాన్యం ఏర్పడింది. సమావేశంలో ముఖ్యమంత్రి మార్పుపై నిర్ణయం తీసుకుంటారని పలువురు భావించారు. పలు టీవీ […]

ఇంకో పదేళ్లు.. నేనే సీఎం.. కార్యవర్గ సమావేశంలో సీఎం కేసీఆర్​ స్పష్టీకరణ..!
X

‘సీఎం మార్పు’ అంశంపై కేసీఆర్​ క్లారిటీ ఇచ్చేశారు. ఊహాగానాలకు తెరదించారు. మరో పదేళ్లపాటు తానే సీఎంగా ఉంటానని ప్రకటించేశారు. ఇవాళ హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో టీఆర్​ఎస్​ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ పార్టీ కార్యవర్గ సభ్యులతో సమావేశమయ్యారు. త్వరలో తెలంగాణకు కేటీఆర్​ సీఎం కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. పలువురు మంత్రులు కూడా ఈ విషయంపై నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. దీంతో ఇవాళ జరిగిన మీటింగ్​కు ప్రాధాన్యం ఏర్పడింది.

సమావేశంలో ముఖ్యమంత్రి మార్పుపై నిర్ణయం తీసుకుంటారని పలువురు భావించారు. పలు టీవీ చానల్స్​లోనూ ఇదే విషయంపై వార్తలు వచ్చాయి. ఎవరి అంచనాలకు చిక్కని సీఎం కేసీఆర్​ ఈ సారి కూడా తన స్టయిల్​ను కొనసాగించారు. ‘కేటీఆర్​ సీఎం’ అన్న ఊహాగానాలకు తెరదించారు. తాను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని.. ఇంకో పదేళ్లపాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్పష్టం చేశారు. దీంతో మీడియా సంస్థలు చల్లబడ్డాయి. ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ సభ్యత్వాలు, సాగర్​ ఉప ఎన్నిక, జీహెచ్​ఎంసీ మేయర్​ ఎన్నిక తదితర అంశాలపై చర్చ జరిగింది.

ఈ నెల 12 నుంచి అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున టీఆర్​ఎస్​ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని సీఎం నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గంలో దాదాపు 50 వేల సభ్యత్వాలు జరపాలని సీఎం కేసీఆర్​ ఆదేశించారు. నాగార్జున సాగర్​ ఉప ఎన్నికలో టీఆర్​ఎస్​ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్​ఎంసీ మేయర్​ ఎన్నికపై కూడా సీఎం కేసీఆర్​ క్లారిటీ ఇచ్చేశారు. మేయర్​ ఎన్నిక రోజే మేయర్​ ఎవరన్న విషయం ప్రకటిస్తామని చెప్పారు.

First Published:  7 Feb 2021 10:25 AM GMT
Next Story